ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బహిరంగ చర్చకు సిద్ధమా…??
కాంగ్రెస్ పార్టీ నాయకులు శివ చౌదరి సవాల్…
భారతీయ వెలుగు కూకట్పల్లి ప్రతినిధి
ప్రభుత్వ స్థలాలు, హౌసింగ్ బోర్డ్స్ స్థలాలు, కబ్జాలకు గురై పార్కుల్లో అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి, దానిపై చర్యలు చేపట్టలేని ఎమ్మెల్యే కృష్ణారావు వితండవాదం చేయడం ఎంతవరకు సబబు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు శివా చౌదరి అన్నారు ..
ప్రజా వినియోగార్ధం ఉంచిన ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలు అక్రమ షెడ్లు నిర్మించింది మీ అనుచరులు కాదా??
ప్రభుత్వ స్థలమైనటువంటి రమ్యా గ్రౌండ్లో అక్రమ కట్టడాలకు పూనుకుంది ఎవరు? పాఠశాల అంటూ గత ప్రభుత్వంలో హడావుడి చేసిన మీరు, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే బిఆర్ఎస్ నాయకులు ఎందుకు వెనకడుగు వేశారు??అమలు చేయవలసిన కబ్జాకు అంతరాయం కలిగిందా??
కూకట్పల్లి నియోజకవర్గం గోపాల్ నగర్ లో తొమ్మిది ఎకరాల పార్కు స్థలం కబ్జాకు గురైంది. గోపాల్ నగర్ లో ఒక గుడి లేదు, ఒక బడి లేదు. 10 సంవత్సరాల్లో మీరు ఏం సాధించారు. ఈ విషయంపై చర్చకు సిద్ధమేనా అని బదులిచ్చారు..
ప్రభుత్వ స్థలాల్లో, పార్కుల్లో ఉన్న అక్రమ కట్టడాలు, కబ్జాలను చర నుంచి మీరు ప్రభుత్వ భూములను కాపాడటంలో, ప్రభుత్వ భూములను కాపాడి ప్రజా వినియోగం తీసుకురావడంలో మీరు పూర్తిగా విఫలమయ్యారు.
కెపిహెచ్బి హౌసింగ్ బోర్డ్ ల్యాండ్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో కబ్జాలకు రావటం లేదు ఎమ్మెల్యే కృష్ణారావు,కబ్జాల నుండి కాపాడటం కోసమే వాస్తవ రూపంలో ప్రజలకు వినియోగంలో తీసుకురావడం కోసమే వేలం పాట జరుగుతుంది స్తోమత ఉన్నవారు కొనుక్కుంటారు దానిలో మీకు కలిగిన ఇబ్బంది ఏమిటి?? మీరు కబ్జా చేయడం కోసం ఈ స్థలాన్ని అడ్డుకుంటారా …ప్రజా వినియోగం వచ్చిన ప్రభుత్వ స్థలాలు కబ్జాలు ఆగిపోతాయి అని అడ్డు తగులుతామని చెబుతున్నారా??
బంగారు తెలంగాణ అంటూ మాయమాటలు చెప్పి గత ప్రభుత్వంలో కోకాపేట భూములు,నాగోల్ ప్రభుత్వ భూముల్లో వెంచర్ల వేసి ఫ్లాట్లో అమ్ముకున్నారు. ఓఆర్ఆర్ రోడ్లను కూడా అమ్ముకున్న దుస్థితి మీది.గత పది సంవత్సరాల్లో చెరువులు కబ్జాలు విపరీతంగా పెరిగాయి.
కూకట్పల్లి నియోజకవర్గంలో చెరువులు కబ్జాలకు గురయ్యాయి దానిపై మీరు చర్యలు చేపట్టక పోగా మీ అనుచరులు ద్వారానే దందా నడిపించారు.ఏమీ తెలియనట్లుగా మైకు దొరికిన వెంటనే ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారు.
పేదలపై ప్రేమ ఉన్న మీరు గత పది ఏళ్లలో ఒక్కరికి కూడా ఒక్క రేషన్ కార్డుకూడా అందించలేకపోయారు. పేదలకు ఇల్లు కట్టించలేకపోయారు ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయారు.
ఒక ఎమ్మెల్యేగా ఉండి కార్పొరేటర్ల చేతిలో ఉండి కూడా కెపిహెచ్బి లో ఉన్నటువంటి 630 ఎల్ఐజి ఫ్లాట్స్ ఓనర్స్ కు, హౌసింగ్ బోర్డ్ కు మధ్య ఉన్న సమస్యను గత పది సంవత్సరాల్లో పరిష్కారం చూపలేకపోయారు. పైగా సమస్యలను జటిలం చేస్తున్నారు.
నిజమైన పేదల పక్షపాతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ . వీరి సమక్షంలో పేదలకు రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఇల్లు మంజూరు కాపాడుతున్నాయి. ప్రతి సమస్య పరిష్కరింపబడుతుంది. బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అని గుర్తుంచుకోండి. వేలాన్ని అడ్డు తగిలితే తమరు ఈ స్థలాన్ని కబ్జాలు చేసే అందుకే అని తాము భావించాల్సి వస్తుందని శివ చౌదరి అభిప్రాయపడ్డారు