భారతీయ వెలుగు ప్రతినిధి హైదరాబాద్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ నియామకం
మధ్యప్రదేశ్‌కు చెందిన మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగి కీలక పదవులను నిర్వహించారు. ఆల్ ఇండియా ఎన్,ఎస్,యూఐ మరియు యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, అలాగే ఆల్ ఇండియా రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ చైర్‌పర్సన్‌గా ఆమె పాత్ర ప్రశంసనీయమైనది. అంతేగాక, ఏ,ఐ,సీ,సీలో కూడా కీలక బాధ్యతలు నిర్వహించిన ఆమె, 2009 మరియు 2014 లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. భవిష్యత్ భారత ప్రధానిగా గుర్తింపు పొందిన రాహుల్ గాంధీ గారి అత్యంత నమ్మకమైన నేతల్లో మీనాక్షి నటరాజన్ ఒకరు నాయకురాలిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా నియమితులవ్వడం హర్షణీయమైన పరిణామం. ఈ కొత్త బాధ్యతల్లో ఆమె విజయవంతంగా నిర్వహిస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు సహాయ సహకారాలు అందిస్తారని అంటున్నారు.