Breaking News

శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి నవహ్నిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా 24-3-2025 సోమవారం ఉదయం 11-45 నిమిషాలకు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి కల్యాణోత్సవం. అన్నదానం చేయు దాత శ్రీ V. మానస బాల్ రాజ్ గౌడ్ , (శ్రీ వినాయక ఫైనాన్స్ కమ్యూనికేషన్స్) వర్తక సంఘము అధ్యక్షులు ,గ్రామం: వీరన్న గూడెం (బొంతపల్లి) మున్సిపాలిటీ – గుమ్మడిదల జిల్లా:సంగారెడ్డి తెలంగాణ.శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి కల్యాణోత్సవం రోజున భక్తులు అందరు అధిక సంఖ్యలో వచ్చి స్వామి అమ్మవారికి దర్శించుకొని అన్న ప్రసాదం స్వీకరించి స్వామీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. గత 11 సంవత్సరాల నుండి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణోత్సవం రోజు శ్రీ V. బాల్ రాజ్ గౌడ్ గారు అన్నదాన కార్యక్రమం చేస్తు స్వామి అమ్మవారి సేవలో పాల్గొంటున్నారు.

శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి నవహ్నిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి కల్యాణోత్సవం. అన్నదానం చేయు దాత శ్రీ వి. మానస బాల్ రాజ్ గౌడ్ , (శ్రీ వినాయక ఫైనాన్స్ కమ్యూనికేషన్స్) వర్తక సంఘము అధ్యక్షులు ,గ్రామం: వీరన్న గూడెం (బొంతపల్లి) మున్సిపాలిటీ – గుమ్మడిదల జిల్లా:సంగారెడ్డి తెలంగాణ.శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి కల్యాణోత్సవం రోజున భక్తులు అందరు అధిక సంఖ్యలో వచ్చి స్వామి అమ్మవారికి దర్శించుకొని అన్న ప్రసాదం స్వీకరించి స్వామీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. గత 11 సంవత్సరాల నుండి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణోత్సవం రోజు శ్రీ వి. బాల్ రాజ్ గౌడ్ గారు అన్నదాన కార్యక్రమం చేస్తు స్వామి అమ్మవారి సేవలో పాల్గొంటున్నారు.

ఠాగూర్ సినిమా ను తలదన్నేలా శవాన్ని కి మూడు రోజులుగా వైద్యం …

మియాపూర్ సిద్ధార్థ న్యూరో హాస్పిటల్ వైద్యులు…

మృతురాలు సుహాసిని

నాకు ముఖ్యమంత్రి తెలుసు. ఎవరికీ చెప్పకుంటారో చెప్పుకోండి

సిద్ధార్థ హాస్పిటల్ యాజమాన్యం…

తమాషాలు చేస్తున్నారా రౌడీలను రప్పిస్తా అంటూ బెదిరింపు

దళితులను మోసం చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం కాదా కాంగ్రెస్ నేత శివ చౌదరి…

భారతీయ వెలుగు శేరిలింగంపల్లి :

ఠాగూర్ సినిమా దర్శకుడు వి.వి వినాయక్ ప్రైవేటు ఆసుపత్రులలో జరుగుతున్న దోపిడీలను యాజమాన్య నిర్వాహకము డాక్టర్లు చేస్తున్న వ్యవహారము ఆనాడే తన చాకచక్యంతో ప్రజలకు కళ్లకు కట్టినట్లు సినిమాను చూపించాడు కానీ సినిమాల్లో కథ సన్నివేశాలు మామూ లే కదా.. అందరూ అనుకున్నారు కానీ దానిని తలదన్నే విధంగా మియాపూర్ సిద్ధార్థ న్యూరో హాస్పిటల్ యాజమాన్యం సాక్షాత్తుగా మూడు రోజులపాటు చనిపోయిన శవానికే వైద్యం చేయడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది….

మియాపూర్ పోలీస్ స్టేషన్
పరిధిలోని సిద్ధార్థ న్యూరో ఆస్పత్రిలో మరోసారి ఠాగూర్ సినిమాలోని సన్నివేశాలు మైమరిపించే విధంగా ఉంది… మియాపూర్ సిద్ధార్థ న్యూరో హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్ల వైద్యం… న్యూరో సమస్యతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన రోగి చనిపోయిన మూడు, రోజుల తర్వాత కూడా వైద్యము చేసి లక్షల్లో బిల్లు కాజేసి చివరికి శవాన్ని అప్పగించారంటూ బాధితులు మదీనగూడ సిద్దార్థ్ న్యూరో ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా నందునూరు గ్రామానికి చెందిన జి. సుహాసిని (26) డిగ్రీ పూర్తిచేసుకుని ఇంటి దగ్గరే ఉండేది. అయితే గత నెల 10వ తేదీన ఆమె కళ్లు తిరిగి పడిపోయింది. వారి బంధువులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ సరైన వైద్యం అందడం లేదని, పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెప్పడంతో వారు అక్కడి డాక్టర్ ను సంప్రదించగా చెన్నెకి కానీ లేదా హైదరాబాద్ కు కానీ తరలించాలని సూచించారు. దాంతో మృతురాలిని నగరంలోని మియాపూర్ సిద్దార్థ్ న్యూరో ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుండి సిద్దార్థ్ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇప్పటి వరకు ఆమెకు వైద్యానికి అయిన రూ.13 లక్షలను బాధితులు ఆస్పత్రికి చెల్లించారు.

మరో రూ.5 లక్షలు కట్టాల్సి ఉంది. అయితే శుక్రవారం అర్ధరాత్రి ఆస్పత్రి యాజమాన్యం మృతురాలి బంధువులకు కాల్ చేసి యువతి సీరియస్ గా ఉందని డబ్బులు కట్టి వెంటనే ఇక్కడి నుండి తరలించాలని లేదంటే తామే మాస్క్ తీసేస్తామని హెచ్చరించారు. దీంతో భయపడిన బాధితులు యువతిని అంబులెన్స్ ద్వారా నిమ్స్ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే అంబులెన్స్ లో పేషెంట్ ను తీసుకువెళ్తుండగా అందులో వెళ్తున్న ఆస్పత్రి అటెండర్ మధ్యలోనే వదిలేసి వెళ్లాడని, అక్కడ మరో వ్యక్తి తమతో పాటు నిమ్స్ ఆస్పత్రికి వచ్చాడని తెలిపారు. ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ కు చూపించగా పేషెంట్ చనిపోయిందని అక్కడి డాక్టర్లు తెలిపారు. దీంతో మృతురాలి బంధువులు మృతదేహాన్ని తిరిగి మదీనగూడ సిద్దార్థ్ న్యూరో ఆసుపత్రికి తీసుకువచ్చి తమకు న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఇదే విషయం పై సిద్దార్థ్ న్యూరో ఆస్పత్రి సీఈఓ డాక్టర్ వెంకటేష్ ను వివరణ కోరగా న్యాయపరమైన నోటీసు తీసుకుని వస్తే మాట్లాడుతా లేదంటే మాట్లాడను అంటూ మీడియా ప్రతినిధుల పై చిరు బోరు చేశారు. నా ఛాంబర్ లోకి ఎందుకు వచ్చారు. మీకేం పని ఎవరు రమ్మన్నారు అంటూ దురుసుగా వ్యవహరించారు.సిద్దార్థ్ న్యూరో ఆస్పత్రి సిబ్బంది సైతం తమ పై భౌతిక దాడికి యత్నించారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి

చనిపోయిన నా చెలేలుకు 3 రోజులు గా వైద్యం చేశారు… రాకేష్

దళితులను మోసం చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం కాదా కాంగ్రెస్ నేత శివ చౌదరి…

గత నెల 11న మా చెల్లి కళ్లు తిరిగి పడిపోతే కడప నుండి ఇక్కడికి తీసుకువచ్చాం. అప్పటి నుండి ఇక్కడ వైద్యం చేపిస్తున్నాం. ఇప్పటికి రూ.13 లక్షలు చెల్లించాం. ప్రతీరోజు కోలుకుంటుందని చెప్పారు. తీరా ఇప్పుడు చనిపోయిందని శవాన్ని అప్పగించారు. మూడు రోజుల క్రితమే చనిపోయినా మాకు ఇప్పటి వరకు చెప్పలేదు. మాకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు కోరారు.

ముఖ్యమంత్రి తెలుసు.. అవసరం అయితే రౌడీలను దింపుతా.. డాక్టర్ సిద్దార్థ్ రెడ్డి

బాధితుల ఆందోళన పై సిద్దార్థ్ న్యూరో ఆస్పత్రి ఎండీ డాక్టర్ సిద్దార్థ్ రెడ్డి ను మీడియా ప్రతినిధులు సంప్రదించగా ఎవరేం చేసుకుంటారో చేసుకోండి. ఏం రాసుకుంటారు .. రాసుకోండి. నాకు సీఎం తెలుసు ఆయనకు ట్విట్టర్ ( ( ఎక్స్ )చేశా, నేను ఫోన్ కొడితే రాయలసీమ నుండి వందల మంది రౌడీలు దిగుతారు. నా సంగతి మీకు తెలియదు అంటూ మీడియా ప్రతినిధులను సైతం డాక్టర్ సిద్దార్థ్ రెడ్డి బెదిరించారు.