మూడవ నేత్రాలను ప్రారంభించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పిఎసి చైర్మన్ అరికేపూడి గాంధీ
భారతీయ తెలుగు శేరిలింగంపల్లి
హఫీజ్ పేట్ గ్రామ యువ నాయకుడు నిమ్మల దాత్రీ గౌడ్ ఆధ్వర్యంలో జనప్రియనగర్ కాలనీ ఫేజ్ 1 , 2 అసోసియేషన్ సభ్యుల కోరిక మేరకు తన స్వంత నిధులతో దాదాపు 32 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిజా నేత్రాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే,ఆరెకపూడి గాంధీ, మియాపూర్ ఎస్ఐ పాల్గొని ప్రారంభించారు. గాంధీ మాట్లాడుతూ. ఒక్క సీసీ కెమెరా 100 పంది పోలీసుల పనితో సమానమని ఈ సందర్భంగా కొనియాడారు.
డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు కానీ వాటిని ప్రజల ఉపయోగాల కోసం ఖర్చుపెట్టే మంచి మనసున్న వ్యక్తి ధాత్రి గౌడ్ అని అన్నారు. కాలని అభివృద్ధి కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టడం ఎంతో అభినందనీయమని ఇంతకుముందు కూడా తన సొంత డబ్బులతో కాలనీలలో నీటితో ఇబ్బంది కలగకుండా ఎన్నో బోర్లు వేశారని ప్రజల సౌకర్యార్థం కమిటీ హాల్ నిర్మించారని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వివరించారు.
ఇంత చిన్న వయసులోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ధాత్రి గౌడ్ ను అందరు ఆదర్శంగా తీసుకుని కాలనీలలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలంటే అని అన్నారు. ఇలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి భవిష్యత్తులో ఉన్నత స్థితికి రావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మియాపూర్ ఎస్సై, జనప్రియనగర్ ఫేస్ 1 కాలనీ అధ్యక్షుడు జయసూర్య, మల్లికార్జున్, సుధాకర్ దాస్, ఫేస్ 2 కాలనీ అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్, జనరల్ సెక్రటరీ, తదితరులు పాల్గొన్నారు.

