మనీ కోసమే మల్టీ స్పెషాలిటీలు…
భారతీయ వెలుగు ప్రతినిధి
దేవుడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు ఆ దేవుడు రూపంలో డాక్టర్లను పోలుస్తారు కానీ అదే ఆసరాగా చేసుకుని డాక్టర్లు పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు దేవుడు అనే నినాదం ఆనాటి నానుడి నేడు మని సంపాదించే వాడే డాక్టర్ అన్న రీతిలో తయారయ్యింది ఈ మల్టీ స్పెషాలిటీల ఆస్పటల్ నిర్వాహకం మల్టీ స్పెషాలిటీల పేరుతో వేలాది రూపాయలు పేదల నుండి దోపిడికి పాల్పడుతున్నారంటే ఏ స్థాయిలో ఉందో ఇట్లే అర్థమవుతుంది ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దావకానకు అనేవారు కానీ ఇప్పుడు అదే పాట వద్దు బిడ్డో ప్రైవేటు హాస్పిటలకు అనే స్థితికి దిగజారిపోతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్ లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఈ హాస్పిటల్ లపై నియంత్రణ లేకపోవడం వారికి ఆడిందే పాట పాడిందే పాటగా మారింది
వైద్యో నారాయణో హరి అన్నారు. పెద్దలు ఇప్పుడు దానికి విరుద్ధంగా ధనం వైద్య నారాయణోహరిగా మారింది.పేషెంట్ ప్రాణాలు కాదు వారికి పైసలే ముఖ్యం ఆదివారం నాడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడిలో వైద్య సేవలు అందిస్తున్న సన్ రైస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాకం వినడానికి వింతగా ఉంది. వివరాల్లోకి వెళితే భీంగల్ మండలంలోని పూరనిపేట్ గ్రామానికి చెందిన మృతురాలి పేరు ఎర్రగుంట గంగమ్మ ఈమెకు సంతానం ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. సన్ రైస్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం తీసుకెళ్తే 12 గంటల వ్యవధిలోనే 60 వేల రూపాయలు చెల్లించాలని మృతురాలి కుటుంబాన్ని హాస్పిటల్ సిబ్బంది వేధించిన వైనం మృతురాలు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న చివరి దశలో పూర్తిగా డబ్బు చెల్లించే వరకు పేషెంట్ ని ఇవ్వని వైనం డబ్బు చెల్లించిన తర్వాత బలవంతంగా అంబులెన్స్ లోకి ఎక్కించిన హాస్పటల్ సిబ్బంది ఎక్కించి ఇక్కడ నుండి తీసుకు వెళ్ళమని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న డబ్బులే ముఖ్యమని చేతులు దులుపుకున్న సన్ రైస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు ముందు పైసా పేకొ తమాషా దేకొ లేదంటే రోగినీ ఇక్కడి నుంచి కరాకండిగా తరలించుకోవచ్చని తేల్చి చెప్పారు. పుట్టగొడుగుల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పేరిట లక్షల్లో డబ్బు దోచుకోవడమే వారి లక్ష్యం హాస్పిటల్లో నిర్లక్ష్యానికి బలవుతున్న రోగులను నిలువు దోపిడీ చేసి తీసుకు వెళ్ళమని అంటున్న హాస్పిటల్లు కోకోల్లలు అధికార యంత్రాంగం ఇకనైనా నిద్ర మత్తు వదిలి ఇలాంటి హాస్పిటల్స్ పై మరియు ఆర్,ఎంపిల పి,ఎంపిల డాక్టర్లను ఏజెంట్లుగా నియమించి మా హాస్పిటల్కు పేషెంట్ ను తీసుకొస్తే 30% 40% 50% లుగా కమిషన్లు ఇస్తామని లక్షలకు పడగలెత్తుతున్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పై చర్య తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ కు విన్నవించుకున్న రోగి తరపు బంధువులు డాక్టరు ఒకలా చెప్తారు మేనేజ్మెంట్ మరోలా చెబుతుంది. పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న పట్టించుకోని డాక్టర్లు వారికి డబ్బే ప్రాముఖ్యం డబ్బులు పూర్తిగా చెల్లించిన తర్వాత రోగిని తీసుకువెళ్లండి గ్యారంటీ లేని చికిత్సలు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎందుకు మరి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న అందని ద్రాక్ష గా వ్యవహరిస్తున్న మల్టీస్పెషల్టి ఆసుపత్రులు ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగిన రోగి బంధువులు చివరికి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్ ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రక్రియలో సన్ రైజ్ ఆసుపత్రి వారు నాలుగు గంటలు కాలయాపన చేయడం వలన రోగి తుది శ్వాస విడిచేలా చేశారు. ఈ సన్ రైజ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యంపై స్థానిక డాక్టర్లపై మేనేజర్లపై చర్య తీసుకోవాలని రోగి బంధువులు మీడియా తరఫున ఆస్పత్రి పై కఠిన చర్యలు తీసుకొని మాకు తగు న్యాయం చేయాలని ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకొని ఇలాంటి హాస్పిటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మాకు తగు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు అంటున్నారు.