నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండండి కేసీఆర్ పిలుపు…!
కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది ఇక పైకి లేవడం కష్టమే…
100% మళ్లీ అధికారంలోకి వస్తున్నాం కెసిఆర్ భరోసా…!
ప్రజల కోసం పార్టీ నేతలు కష్టపడి పని చేయాలి…
ఏప్రిల్ 10 నుంచి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు నమోదు చేయాలి.. కేసీఆర్
జిల్లాలలో మండలాల్లో బి ఆర్ ఎస్ పార్టీ కమిటీలను నియమించాలి…
పిరాయింపు ఎమ్మెల్యేలను ఉప ఎన్నికల్లో కచ్చితంగా ఓడగొట్టాలి కెసిఆర్..
భారతీయ వెలుగు ప్రతినిధి హైదరాబాద్.
తెలంగాణ రాష్ట్రంలో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జోష్యం చెప్పారు.. టిఆర్ఎస్ పార్టీ విస్తృత కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కేసీఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు తోపాటు పార్టీ కార్యవర్గ జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రస్తుత మాజీ ఎంపీలు శాసనమండలి సభ్యులు శాసనసభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్ లు డి సి సి బి డిసి ఎం ఎస్ అధ్యక్షులు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీలు విస్తృత కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు అనంతరం ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ 100% మళ్లీ అధికారంలోకి టిఆర్ఎస్ పార్టీ వస్తుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు ప్రతి నాయకుడు కార్యకర్త శ్రమించి కష్టపడాలని సూచించారు తెలంగాణ రాష్ట్రంలో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తున్నాయని మనల్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా నాయకులకు కార్యకర్తలకు సూచించారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు రాబోతుందని కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తున్నాయి పిరాయింపు ఎమ్మెల్యేలను ఓడ గొట్టి తమ సత్తా ఏమిటో కార్యకర్తలు నాయకులు నిరూపించాలని పిలుపునిచ్చారు ఏప్రిల్ 10 నుంచి టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టాలని నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు ప్రతి జిల్లా కేంద్రాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు మొదలు పెట్టాలని కేసీఆర్ పేర్కొన్నారు 25 ఏళ్ల బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహణ గురించి చర్చించడంతోపాటు గ్రామస్థాయి నుండి పార్టీ నిర్మాణం నిర్మాణాత్మక కార్యచరణ గురించి పార్టీ నేతలకు అధినేత కేసిఆర్ సూచనలు సలహాలు నిర్దేశం చేశారు. బిఆర్ఎస్ పార్టీ కమిటీలను వేయాలని నిర్ణయించమన్నారు కమిటీలకు ఇన్చార్జిగా హరీష్ రావుకు బాధ్యతలు అప్ప చెప్తున్నామని కెసిఆర్ తెలిపారు.
ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కలవకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న కేసీఆర్ అధ్యక్షతన ప్లీనరీ సమావేశాలు జరుగుతాయని కేటీఆర్ వెల్లడించారు. బిడ్డ రేవంత్ రెడ్డి అన్ని పేర్లు రాసిపెట్టుకుంటాం వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం అని ఘాటైన సమాధానం చెప్పారు ఐ ఏ ఎస్ గా కాదు ఐఎన్సి కార్యకర్తగా పనిచేస్తున్నాడని ముందే తెలుసు అని రేవంత్ రెడ్డికి సెటిల్ వేశారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోను ఉన్నాయని బాగా నాయకులు కార్యకర్తలు కష్టపడి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని వివరించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో కచ్చితంగా ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ ఆయా నియోజకవర్గాల కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు.

