శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి నవహ్నిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా 24-3-2025 సోమవారం ఉదయం 11-45 నిమిషాలకు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి కల్యాణోత్సవం. అన్నదానం చేయు దాత శ్రీ V. మానస బాల్ రాజ్ గౌడ్ , (శ్రీ వినాయక ఫైనాన్స్ కమ్యూనికేషన్స్) వర్తక సంఘము అధ్యక్షులు ,గ్రామం: వీరన్న గూడెం (బొంతపల్లి) మున్సిపాలిటీ – గుమ్మడిదల జిల్లా:సంగారెడ్డి తెలంగాణ.శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి కల్యాణోత్సవం రోజున భక్తులు అందరు అధిక సంఖ్యలో వచ్చి స్వామి అమ్మవారికి దర్శించుకొని అన్న ప్రసాదం స్వీకరించి స్వామీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. గత 11 సంవత్సరాల నుండి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణోత్సవం రోజు శ్రీ V. బాల్ రాజ్ గౌడ్ గారు అన్నదాన కార్యక్రమం చేస్తు స్వామి అమ్మవారి సేవలో పాల్గొంటున్నారు.