మూడు ఎకరాల భూమి దళితులకు ఇస్తామని నమ్మించి నట్టేట ముంచలేదా
దళిత ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి నయవంచన చేసింది ఎవరు
తెలంగాణ సమాజానికి పట్టిన చీకటి బిఆర్ఎస్ పార్టీ
చీకటిని చీల్చి వెలుగులోకి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు పట్టం కట్టారు..
అధికారం పోవడంతో పిచ్చెక్కినట్లు అది ఓర్వలేక చిరాకులు ఆవాకులు…
కల్లు తాగిన కోతి లాగా తయారయింది బిఆర్ఎస్ పరిస్థితి…
భారతీయ వెలుగు ప్రతినిధి కూకట్పల్లి
దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన బిఆర్ఎస్ ప్రభుత్వం దళితులను నమ్మించి నట్టేట ముచ్చింది కేసీఆర్ కాదా అని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుడు శివ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజానికి బిఆర్ఎస్ పార్టీ పట్టిన చీకటిని తొలగించి కాంగ్రెస్ ప్రభుత్వనికి పట్టం కట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి రేషన్ కార్డులు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత బంధువు వంటి సంక్షేమ పథకాలు ఆశ చూపించి మోసం చేయలేదా ఈ విషయం నీకంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరు అని కుకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును ప్రశ్నించారు. మీరు నిజాయితీగా ప్రజలను మోసం చేయకుండా ఉండింటే మీరే అధికారంలోకి వచ్చి ఉండేవారు కదా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పట్టం కట్టారో ఇంకా మీకు అర్థం కాలేదా అని ఏదేవా చేశారు. ఎమ్మెల్యే కృష్ణారావు ఊకదంపుడు ప్రచారాల వల్ల ప్రజలు నమ్మలేని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ నీ రాజకీయాల్లోకి తీసుకువచ్చింది తానే అని చెప్పుకోవడం నీతిమాలిన రాజకీయానికి పరాకాష్ట అని సంబోధించారు. మీ నాయకులు చెప్పిన ఒత్తిత్తి మాటలు విని గాలిలో కాలేశ్వరం ప్రాజెక్టు లాంటి మాటలు మూటలు కట్టుకోకండి అవి కూలిపోతాయి అంటూ బదులిచ్చారు. ఏదైనా వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ ను ఓడించడం మీ నాయకులు, మీరు వంద ప్రదక్షిణలు చేసిన ఓడించలేరని ఈ సంగతి గుర్తు పెట్టుకోవాలని అభిప్రాయపడ్డారు. బండి రమేష్ గెలుపు నల్లేరుపై నడికేనని ఈ సందర్భంగా కొనేయాడారు. బండి రమేష్ ను విమర్శించే స్థాయి బిఆర్ఎస్ పార్టీలో ఎవరికి లేదని బిఆర్ఎస్ పార్టీలో బండి రమేష్ చేసిన సేవలు మీరు మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా మాట్లాడేటప్పుడు ఎవరు ఎటువంటి వ్యక్తులు ఒక్కసారి ఆలోచించి మాట్లాడాలని ఎమ్మెల్యే కృష్ణారావుకు, ఆయన అనుచరగణానికి శివ చౌదరి ఘాటుగా బదిలించారు.