Breaking News

మృతి చెందాడని పోస్ట్ మార్దనికి ఏర్పాట్లు బ్రతికే ఉన్నానంటూ యువకుడు కేకలు ఆశ్చర్యానికి గురైన వైద్యులు

భారతీయ వెలుగు

💥 పోస్టుమార్టానికి వైద్యుల ఏర్పాట్లు.. బతికే ఉన్నానంటూ యువకుడి కేకలు!

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి

💥 షాక్ అయిన వైద్యులు

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఘటన
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు
చికిత్స పొందుతూ మృతి చెందినట్టు వైద్యుల ప్రకటన
పోస్టుమార్టం కోసం స్ట్రెచర్‌పై తీసుకెళ్తుండగా కదలిక
ఆపై బతికే ఉన్నానంటూ కేకలు
విచారణకు ఆదేశించిన మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చనిపోయాడని భావించిన వైద్యులు పోస్టుమార్టంకు సిద్ధపడగా అతడి కేకలతో ఉలిక్కిపడ్డారు. మళ్లీ ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ మెడికల్ కాలేజీలో జరిగిందీ ఘటన. గోట్కా గ్రామానికి చెందిన షగుణ్‌శర్మ బుధవారం రాత్రి తన సోదరుడితో కలిసి బైక్‌పై ఖతౌలీ వైపు వెళ్తుండగా ఓ వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

షగుణ్‌శర్మ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మీరట్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఏర్పాట్లు చేశారు. స్ట్రెచర్‌పై మార్చురీకి తరలిస్తున్న సమయంలో ‘సార్.. నేను బతికే ఉన్నా’ అని షగుణ్ కేక వేయడంతో వైద్యులు షాకయ్యారు. వెంటనే అతడిని మళ్లీ ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స ప్రారంభించారు. కాగా, ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ విచారణకు ఆదేశించారు.