Breaking News

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి

ఉన్నతమైన పదవిలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌పై పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెబుతూ మంత్రి పదవికి రాజీనామా చేయాలి సోషల్ మీడియా కన్వీనర్ కవిజార్

నిరసనలో పాల్గొని అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేసిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, ఎంబిసి చైర్మన్ జేరిపెట్టి జైపాల్

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

శేరిలింగంపల్లి భారతీయ వెలుగు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిండు సభలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసనగా గురువారం చందానగర్ డివిజన్ పరిధిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకుడు సోషల్ మీడియా కన్వీనర్ కవిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిరసన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ చైర్మన్ జెరిపేటి జైపాల్, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులతో కలిసి జాతీయ రహదారిపై అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేర్లింగంపల్లి కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంబీసీ చైర్మన్ జెరిపేటి జైపాల్ జైపాల్, శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ లు మాట్లాడుతూ. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తక్షణమే ప్రధానమంత్రి మోడీ స్పందించి అమిత్ షా పై చర్యలు తీసుకొని క్షమాపణలు చెప్పించాల్సిందిగా కోరారు. అదేవిధంగా అమిత్ షా మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని చందానగర్ 110 డివిజన్ నూతన అధ్యక్షుడిగా మధు కుమార్ ఉప్పుటూరి గెలుపు..