Breaking News

రేవంత్‌పై కుట్ర చేస్తోంది కాంగ్రెస్ సీనియర్లే ?

భారతీయ వెలుగు ప్రతినిధి హైదరాబాద్

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి

రేవంత్ రెడ్డిని వచ్చే జూన్‌ లేదా డిసెంబర్‌లో మార్చేస్తారని ఆయనకు రాహుల్, ప్రియాంకలు అపాయింట్‌మెంట్లు ఇవ్వడం లేదని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అంతర్గత విషయాలపై ఆయన ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారో … ఎవరు మాట్లాడిస్తున్నారో కాంగ్రెస్ లోనే ఓ స్పష్టత కనిపిస్తోంది. మహేశ్వర్ రెడ్డి ఎన్నికలకు ముందు వరకూ కాంగ్రెస్ నేత. కాంగ్రెస్ పరిస్థితి బాగోలేదని ఆయన బీజేపీలో చేరిపోయారు. తర్వాత రేవంత్ పార్టీ అధికారంలోకి తెచ్చారు. దాంతో ఆయన మంత్రి పదవి పోయిందే అని నాలుక్కరుచుకోవాల్సి వచ్చింది.

ఉత్తమ్, కోమటిరెడ్డిలతో ఆయనకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మంత్రి పదవి ఇస్తే రేపే పార్టీలోకి వస్తానని ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజునే ఆయన కోమటిరెడ్డితో రాయబారం నడిపారని బీజేపీలోనే అందరికీ తెలుసు. కానీ రేవంత్ వద్దనుకున్నారు. అందుకే ఆయనకు కోపం ఉండి ఉండవచ్చు.. ఈ క్రమంలో రేవంత్ పై దాడి చేస్తూనే ఉన్నారు. ఆయనతో ఈ మాటలు చెప్పించింది.. రేసులో ఉన్నారని ఆయన ప్రకటించిన వారేనని కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం అనేది అవాస్తమని రేవంత్ ఢిల్లీ పర్యటనలను పరిశీలిస్తే అర్థమైపోతుంది. హైడ్రా కూల్చివేతల తర్వాత కూడా రాహుల్ ను కలిశారు. వయనాడ్ లో ప్రియాంక గాంధీ నామినేషన్ కి వెళ్లే సమయంలో కాంగ్రెస్ కండువాను రేవంత్ కప్పారు. యాక్టివ్ గా పాల్గొన్నారు. రేవంత్‌ రెడ్డికి హైకమాండ్ వద్ద పలుకుబడి అనూహ్యంగా పెరుగుతోంది. తగ్గడం లేదు. ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ బీజేపీని సవాల్ చేస్తున్న వైనం తెలివైన రాజకీయంగా హైకమాండ్ భావిస్తోంది.

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

రేవంత్ పాతుకుపోవడం ఇష్టం లేని సీనియర్లు ఇక్కడ అడ్డగోలు వ్యూహాలతో బీఆర్ఎస్, బీజేపీ నేతలతో తప్పుడు పుకార్లు పుట్టిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు ఓ అభిప్రాయానికి వస్తున్నాయి.