Breaking News

లోక్ సభలో అన్నాచెల్లెళ్లు.. పెద్దల సభలో అమ్మ

భారతీయ వెలుగు ప్రతినిధి న్యూఢిల్లీ

పార్లమెంట్ కు కలిసి రానున్న ముగ్గురు గాంధీలు

ఎంపీగా ప్రమాణం చేయనున్న ప్రియాంక

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి

పార్లమెంట్ లో భార్యాభర్తలు, తండ్రీకూతుళ్లు

పార్లమెంట్ లో గురువారం అరుదైన సంఘటన చోటుచేసుకోనుంది. ఒకే ఫ్యామిలీ నుంచి ముగ్గురు సభకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఇద్దరు సభలో కొనసాగుతుండగా.. మరో సభ్యురాలు నేడు వచ్చి చేరనుంది. నెహ్రూ- గాంధీ ఫ్యామిలీ నుంచి ముగ్గురు పార్లమెంట్ లో అధికారికంగా ఆసీనులుకానున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు తోడుగా వయనాడ్ ఉప ఎన్నికల్లో గెలిచిన ప్రియాంక గాంధీ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

సోనియా గాంధీ పెద్దల సభలో ఉండగా.. అన్నాచెల్లెళ్లు రాహుల్, ప్రియాంక లోక్ సభలో కూర్చోనున్నారు. ఒకే ఫ్యామిలీ నుంచి ఇలా ముగ్గురు పార్లమెంట్ లో ఉండడం అరుదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. లోక్ సభలో భార్యాభర్తలు (అఖిలేశ్ యాదవ్, డింపుల్ యాదవ్), రాజ్యసభలో తండ్రి (శరద్ పవార్), లోక్ సభలో కూతురు (సుప్రియా సూలె) ఇప్పటికే పార్లమెంట్ లో ఉన్నారు. కాగా, అఖిలేశ్ యాదవ్ కజిన్స్ అక్షయ్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్ కూడా లోక్ సభ సభ్యులుగా కొనసాగుతున్నారు.

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి