బిఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్ రావు దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా హరీష్ రావు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళరు. పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ , తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి తో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో హరీష్ రావు కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు వారిని శాలువాతో సన్మానించరు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ మాజీ మంత్రి , సిద్దిపేట శాసనసభ్యుడు, , హరీష్ రావు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందన్నారు, వారు మరెన్నో ఇలాంటి శుభవార్షికోత్సవాలు జరుపుకోవాలని, ప్రజల పక్షాన పోరాడుతూ బి.ఆర్.ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు తెలియజేశారు.