భారతీయ వెలుగు న్యూఢిల్లీ : ఈరోజు ఉదయం పార్లమెంట్ హౌస్ లోని ప్రధానమంత్రి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై విపులంగా చర్చించడం జరిగింది.
రాష్ట్ర నాయకత్వానికి , ప్రజా ప్రతినిధులకు భవిష్యత్తు కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు.
నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాల విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపీలు ,ఎమ్మెల్యేలు వినతి పత్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి , కేంద్ర మంత్రి బండి సంజయ్ , రాజ్యసభ సభ్యులు డా.లక్ష్మణ్ గారు, ఎంపీలు ఈటెల రాజేందర్ , డీకే అరుణ , రఘునందన్ రావు , ధర్మపురి అరవింద్ , గోడం నగేష్ , కొండా విశ్వేశ్వర్ రెడ్డి , ఎమ్మెల్యేలు డా.పాల్వాయి హరీష్ బాబు , రాజాసింగ్ , వెంకటరమణ రెడ్డి , పాయల్ శంకర్ , రామారావు పటేల్ , రాకేష్ రెడ్డి , ధన్ పాల్ సూర్యనారాయణ , ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి పాల్గొన్నారు