Breaking News

మతం మారితే రిజర్వేషన్లు కట్ సుప్రీం కోర్ట్ సంచలనం

భారతీయ వెలుగు ప్రతినిధి న్యూఢిల్లీ

బాస్టిజం తీసుకున్నాక హిందువుగా గుర్తింపు కొనసాగించలేరు

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి

మతం మారడంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రిజర్వేషన్ల కోసం మతం మార్చుకోవడం రాజ్యాంగాన్ని మోసగించడమేనని తేల్చిచెప్పింది. దీంతో ఉద్యోగాల రిజర్వేషన్ల కోసం మతం వారికి తీర్పు ఝలక్ ఇచ్చినట్లయింది.
హిందూ మతంలో ఉండి వివక్ష ఎదుర్కొంటున్న వెనుకబడిన, అణగారిన కులాలకు చెందిన వారి ఉన్నతి కోసం రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. వారి కట్టుబాట్లు, వారి ఆచార వ్యవహారాల ఆధారంగా తరాలపాటు వివక్ష ఎదుర్కొంటున్న వారికి రిజర్వేషన్లు అనే వరాన్ని రాజ్యాంగం అందించింది. ఎవరి మధ్య కూడా అసమానతలు లేకుండా ఈ రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉంది. మతం మారితే కులం పోతుందని.. దాని ఆధారంగా వచ్చే రిజర్వేషన్‌ కూడా వర్తించదని నిబంధన పెట్టారు.

దేశంలో రిజర్వేషన్లతోపాటే ఈ నిబంధన సైతం అమలులోకి వచ్చింది. చాలా మంది మతం మార్చుకున్నప్పటికీ, అధికారికంగా హిందువులుగానే కొనసాగుతూ రిజర్వేషన్‌ ఫలాలు పొందుతున్నారు. హిందూ మతంలోనే ఉంటున్న తమకు వీరివల్ల నష్టం కలుగుతోందని ఆ సామాజిక వర్గం వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. దళిత క్రైస్తవులనూ ఎస్సీలుగా గుర్తించాలనే డిమాండ్లూ ఉన్నాయి.

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

ఈ క్రమంలో సుప్రీంకోర్టు తాజా తీర్పుతో మరింత క్లారిటీ వచ్చినట్లయింది. మతంపై నమ్మకంతో మారితే తప్పులేదని చెప్పింది. బాస్టిజం తీసుకున్నాక హిందువుగా గుర్తింపు కొనసాగించలేరని సూచించింది. హిందూమతాన్ని ఆచరిస్తుండడంతో ఉద్యోగంలో కోటా కోస తనకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని తమిళనాడు యువతి సెల్వరాణి వేసిన కేసును మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. దానిని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. ఆ తీర్పు సరైందేనని సుప్రీంకోర్టూ స్పష్టం చేసింది. ఒక కులం కోటాలో ఉద్యోగం పొంది.. ఆ తరువాత మతం మారితే వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని గతంలో మద్రాసు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. భారతీయార్ విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న అక్రమ నియామకాలపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఓ ఉద్యోగి ఒక కులానికి కేటాయించిన కోటాలో ఉద్యోగం పొంది.. ఆ తర్వాత మతం మారితే ఉద్యోగం నుంచి తొలగించాలని ఖరాఖండిగా చెప్పింది. వారికి ఉద్యోగంలో కొనసాగే హక్కు ఉండదని చెప్పింది.