భారతీయ వెలుగు ప్రతినిధి హైదరాబాద్
జర్నలిస్టులకు అండగా మైనంపల్లి..
ప్రమాదవశాత్తు కాలు విరిగిన ఏబీఎన్ జర్నలిస్టుకు 50 వేల ఆర్థిక సహాయం..
జర్నలిస్టుల తరఫున మైనం పల్లి కి కృతజ్ఞతలు… బొమ్మ అమరేందర్
కాప్రా ఈసీఐఎల్ నేటితరం …
జర్నలిస్టులకు అండగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జు ,మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు . గత కొద్ది రోజుల క్రితం మార్నింగ్ వాకింగ్ కు వెళ్లిన మల్కాజ్గిరి గౌతమ్ నగర్ డివిజన్ ఆంధ్ర జ్యోతి రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్న, లక్ష్మారెడ్డి ప్రమాదవశాత్తు కింద పడి కాలు విరిగి గాయాల పాలై ఈసీఐఎల్ లోని సూర్య ఆర్థోపెడిక్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆపరేషన్ చేయించుకున్నాడు మీడియా జర్నలిస్టుల ద్వారా. తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్,మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంగళవారం ఈసీఐఎల్ లోని సూర్య హాస్పిటల్ లో లక్ష్మారెడ్డి నీ పరామర్శించి అతని ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వెంటనే స్పందించినా మైనంపల్లి తక్షణ సహాయం 50 వేల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు, ఈ సందర్భంగా మల్కాజ్గిరి బి బ్లాక్ అద్యక్షుడు టీ వెంకటేష్ యాదవ్ 10,000 రూపాయలను ఆర్థిక సహాయంగా లక్ష్మారెడ్డికి అందజేశారు ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి వారి అభివృద్ధికి తాను అండగా ఉంటానని ఆపత్కాల సమయంలో జర్నలిస్టుల తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని వారి కుటుంబానికి భరోసాగా ఉంటానని మైనంపల్లి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ఫోన్ చేసి బాధిత జర్నలిస్టు కుటుంబానికి యాజమాన్యం తరపున సాహయ సహకారాలు అందించాలని ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి విన్నవించారు. గాయాల పాలైన జర్నలిస్టు లక్ష్మారెడ్డికి సహాయం చేసిన మైనం పల్లి కి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJ _143 మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బొమ్మ అమరేందర్ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, వెంకటేష్ యాదవ్, సతీష్ కుమార్, ఎస్ ఆర్ ప్రసాద్,రాందాస్ సంతోష్ ముదిరాజ్,వెంకటేశ్వర్ రావు,చంకు శ్రీనివాస్,వినోద్ యాదవ్,లక్ష్మి కాంత్ రెడ్డి, షకీల్,ఇస్టారి,కన్నా,TUWJ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బొమ్మ అమరేందర్ సీనియర్ జర్నలిస్టులు సంగమేష్ , వెంకటేశ్వరరావు రవి యాదవ్ మనోహర్ , రెహమాన్, దొమ్మటి కిరణ్ , జి కృష్ణ,నరేష్ తదితరులు పాల్గొన్నారు