మియాపూర్ లో చిరుత పులి కలకలం
స్థానికులను భయబ్రాంతకం గురిచేసిన చిరుత
ఘటన స్థలానికి పోలీసులు అటవీశాఖ అధికారులు
చిరుత కోసం గాలిస్తున్న అటవీశాఖ అధికారులు మియాపూర్ పోలీసులు
ఒకటే ఉందా? ఇంకా ఏమైనా ఉన్నాయా భయభ్రాంతుల్లో ప్రజలు..
నగరంలోకి చిరుత రావడం ఏమిటి ఎక్కడి నుండి వచ్చింది పోలీసుల ఆరా…
భారతీయ వెలుగు ప్రతినిధి శేరిలింగంపల్లి
ప్రపంచ పటంలోనే శేరిలింగంపల్లి నియోజకవర్గనికి ఒక ప్రత్యేకత, గుర్తింపు ఉంది. అలాంటి ప్రాంతమైన హైటెక్ సిటీ కి కూత పెట్టు దూరంలో చిరుత పులి దర్శనమియడం. ఆ సమాచారం దావలముల వ్యాపించడంతో స్థానికుల లో భయాందోళనలు కలిగించాయి. ఈ ప్రాంతంలో శుక్రవారం రాత్రి చిరుత సంచారంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అంతేకాదు ఆందోళనకు గురిచేసింది. కాంక్రీట్ జంగిల్ గా మారిన ఈ ప్రాంతం మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుకాల నడిగడ తాండ ఉంది. ఈ తాండాకు అతి సమీపం లోనే చిరుత సంచరించినట్లు గుర్తించారు. స్థానికులు మియాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో దీంతో సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు నడిగడ్డ తాండ వద్దకు చేరుకున్నారు పోలీసులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు దీంతో అటవీశాఖ అధికారులు మియాపూర్ పోలీసులు చిరుత కోసం గాలిస్తున్నారు మియాపూర్లో చిరుత సంచారం ఇప్పుడు సంచలనంగా మారింది. చిరుత ఎక్కడి నుండి వచ్చింది. ఇంకా ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో అటవీశాఖ అధికారులు పోలీసులు అరా తీస్తున్నారు అంతేకాదు స్థానికులు సైతం ఇంకా ఎన్ని చిరుతలు ఉన్నాయో అన్న భయంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోకి చిరుత ఎలా వచ్చిందని ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.