Breaking News

అదో బ్రహ్మ పదార్థం

రేవంత్ రెడ్డి క్యాబినెట్

రేవంత్ కెబినెట్ విస్తరణ – అదో బ్రహ్మపదార్థం

భారతీయ వెలుగు ప్రతినిధి హైదరాబాద్

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి

ప్రభుత్వ ఏర్పడి ఏడాది అవుతోంది. ఉన్న పద్దెనిమిది పదవుల్లో ఆరు ఖాళీగా ఉన్నాయి. ఆశావహులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ పదవుల భర్తీ మాత్రం జరగడం లేదు. మంత్రి పదవలు కోసం ఎదురు చూస్తున్న అసహనానికి గురవుతున్నారు. ప్రధాన శాఖలకు మంత్రులు లేరని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనూ హైకమాండ్ నాన్చుతూనే ఉంది. ఏదీ చెప్పడం లేదు. సీఎం ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ఇదిగో గ్రీన్ సిగ్నల్.. అదిగో పచ్చజెండా అని ప్రచారం జరుగుతోంది కానీ ఆ ముహుర్తం మాత్రం రావడం లేదు.

ప్రధాన శాఖలకు మంత్రుల కొరత ఉందని పాలనపై ప్రభావం చూపుతున్నందున ఖాళీల భర్తీకి అవకాశం కల్పించాలని రేవంత్ కోరుతున్నారు. ఆయన సామాజిక సమీకరణాలు, కాంగ్రెస్‌కు రాజకీయంగా లబ్ది చేకూర్చే నేతల్ని ఎంపిక చేసుకుని ఆ లిస్ట్ హైకమాండ్ కు కూడా సమర్పించారు. కానీ తమ కంటే పెద్ద మేధావులు ఎవరూ ఉండరని.. కాంగ్రెస్ ను తామే మోస్తున్నామని ఫీలయ్యే కాంగ్రెస్ హైకమాండ్ కోటరీ మాత్రం కొర్రీలు పెడుతోంది. ఇక్కడి సీనియర్లు మరో జాబితా ఇచ్చారని చెప్పి పక్కన పెట్టేస్తోంది.

ఇప్పటికీ నాలుగు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ కు ఎమ్మెల్యే లేరు. అయినా హైకమాండ్‌కు పట్టడం లేదు. పదేళ్ల పాటు కాంగ్రెస్ కోసం కష్టపడిన వారు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. వాటినీ తేల్చడం లేదు. పదవుల్ని అలా ఖాళీగా ఉంచి పార్టీకి కూడా నష్టం చేయడం కన్నా వీలైనంత త్వరగా భర్తీ చేస్తే సంతృప్తి చెందే నేతలు పార్టీకి విధేయంగా ఉంటారు కదా ఎక్కువ మంది భావన. కానీ కాంగ్రెస్ హైకమాండ్ లెక్కలు వేరే.

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి