ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలి
-అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్
భారతీయ వెలుగు ప్రతినిధి అక్టోబర్-08తెలుగు వెలుగు
మండలంలోని పెండింగ్ లో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ జూలపల్లి తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మండలంలో ఉన్న పెండింగ్ ధరణి సమస్యలు ,ప్రజావాణి, వివిధ సర్టిఫికెట్ల జారి మొదలగు అంశాల పై రివ్యూ నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మండలంలో పెండింగ్ ఉన్న ధరణి దరఖాస్తులను ప్రణాళిక ప్రకారం పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో అవసరమైన ధ్రువీకరణ చేపట్టి పెండింగ్ దరఖాస్తులు పూర్తి చేయాలని అన్నారు.మీసేవ కేంద్రాల ద్వారా వివిధ సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిశీలించి సంబంధిత సర్టిఫికెట్లు జారీ చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చే దరఖాస్తులు, ప్రజా పాలన కింద హైదరాబాద్ నుంచి వచ్చే దరఖాస్తులు ప్రాధాన్యత కల్పిస్తూ పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.ఈ సమావేశంలో మండల తహసిల్దార్ సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు..