సుల్తానాబాద్ పట్టణ రూపురేఖలు మారుస్తా..
గత 10 యేళ్లలో అన్ని రంగాల్లో సుల్తానాబాద్ వెనుకబడింది.
- పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ చింతకుంట విజయరమణ రావు
సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో టీ.ఎఫ్.ఐ.డి.సి నిధులు రూ.2.29 కోట్లతో పలు రోడ్ల నిర్మాణానికి స్థానిక మున్సిపల్ చైర్మన్ గాజుల లక్ష్మి రాజమల్లు మరియు కౌన్సిలర్లతో కలిసి సోమవారం రోజున శంకుస్థాపనలు చేసిన గౌరవ శ్రీ చింతకుంట విజయరమణ రావు..
ట్యాంక్ రోడ్డు నుండి పాత జెండా వరకు రోడ్డు నిర్మాణానికి రూ.1 కోటి రూపాయల నిధులతో, స్వప్న కాలనీలోని రెండు రోడ్లకు రూ.85 లక్షలతో, మార్కండేయ కాలనీలో రోడ్డు నిర్మాణానికి రూ .44.70 లక్షల రూపాయల నిధులతో పనులకు గౌరవ ఎమ్మెల్యే విజయరమణ రావు గారు శంకుస్థాపనలు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే విజయరమణ రావు గారు మాట్లాడుతూ..
టి.ఎఫ్.ఐ.డి.సి TUFIDC నిధుల నుండి రూ. 5 కోట్ల రూపాయలతో మంజూరు చేయించడం జరిగిందని ఇందులో నుండి రూ.2.29 కోట్ల నిధులతో రోడ్లకు శంకుస్థాపన చేసినట్టు చెప్పారు. మిగతా నిధులతో త్వరలోనే మరిన్ని రోడ్ల నిర్మాణాలను చేపడతామని అన్నారు. పట్టణంలో మౌలిక వసతులు, రోడ్ల కోసం రూ.10 కోట్లను సమకూర్చుతున్నట్టు తెలియజేశారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల సుల్తానాబాద్ పట్టణం అభివృద్ధికి నోచుకోకుండా వివక్షకు గురి అయిందని అన్నారు. గత 10 సంవత్సరాల బీ.ఆర్.ఎస్ పాలనలో సుల్తానాబాద్ అభివృద్ధికి నోచుకోకపోగా పాత తాలూకాలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ఇతర చోట్లకు తరలించారని పేర్కొన్నారు. అత్యవసరమైన సేవలు అందించే ఆధార్ సెంటర్, పోస్ట్ మార్టం సెంటర్ ను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి తెరిపించగలిగామని చెప్పారు. రైతులు, పట్టణ ప్రజలు ఎంతగానో విన్నవించుకున్నప్పటికీ సుల్తానాబాద్ చెరువు అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు. రూ. 11 కోట్ల నిధుల ప్రతిపాదనతో చెరువును అభివృద్ధి చేస్తామన్నారు. రాజీవ్ రోడ్డు నుండి పూసాల వరకు రోడ్డు నిర్మాణం కొంత వరకే జరిగిందని, దీనిని గ్రామం వరకు నిర్మాణం పూర్తి చేయనున్నట్టు హామీ ఇచ్చారు. రాజీవ్ రోడ్ నుండి పూసాల చెరువు కట్ట వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గారు వివరించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని పట్టణంలో రోడ్ల వెడల్పును పట్టణ ప్రజల నిర్ణయం మేరకే చేపట్టడం జరిగిందని గౌరవ ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు. రోడ్ల వెడల్పులో ఇల్లు కోల్పోయిన వారికి స్థలాలు, ఇండ్లు నిర్మించి న్యాయం చేకూర్చుతామని చెప్పారు. తాను స్వయంగా అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తానని అన్నారు.
అనంతరం పలువురు నాయకులు, కౌన్సిలర్లు గౌరవ ఎమ్మెల్యే విజయరమణ రావు గారిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, వైస్ చైర్ పర్సన్ బిరుదు సమతా కృష్ణ, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు అంతటి అన్నయ్య గౌడ, మినుపాల ప్రకాష్ రావు, దన్నాయాక దామోదర్ రావు, వెగోలపు అబ్బయ్య గౌడ్, చిలుక సతీష్, కౌన్సిలర్లు ఎం.డి నిషాద్ రఫిక్, దున్నపోతుల రాజయ్య, చింతల సునీత రాజు, పన్నాల రాములు, అమీరిశెట్టి రాయలింగు, కుమార్ కిషోర్, సిద్ద తిరుపతి, గణేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.