భారతీయ వెలుగు ప్రతినిధి
మునిసిపల్ స్థలాలను కాపాడండి లేదా పేదలకు పంచండి
సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ
జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ డిమాండ్
ప్రభుత్వ భూముల్లో పేదలు జానెడు స్థలాన్ని ఆక్రమిస్తే ఎక్కడ లేని చట్టాలు తీసుకవచ్చే అధికారులు నంద్యాల పట్టణంలోని నడిబొడ్డున వున్న మునిసిపల్ స్థలాన్ని ఆక్రమించి యదేచ్చగా రూమలు కడుతున్న మునిసిపల్ అధికారులు కళ్ళుండి గుడ్డివారిగా నటిస్తున్నారని సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ ఆరోపించారు అనంతరం రవిరాజ్ ఎఐయస్ ఎ నాగార్జున లు మాట్లాడుతూ నంద్యాల జిల్లాగా మారిన దగ్గర నుండి భూ కబ్జాలు ఎక్కువైయాయన్ని వాటిని నియంత్రించడంలో అధికారులు విఫలమైయ్యారని వారు దుయ్యబట్టారు భూ ఆక్రమణ దారులకు అధికారులు ఒంత పాడుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు భూ ఆక్రమణ దారులకు వంత పాడే అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధి వున్న తమ ఆదినంలో వున్న మునిసిపల్ స్థలాలను పేదలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు మునిసిపల్ అధికారులు పాలకొమ్మ చెట్టు స్థలంలో అనదికారంగా కట్టిన వాటిని కూల్చివేసి స్థలాన్ని వారి ఆదినంలోకి తీసుకొని యెడల సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో మునిసిపల్ స్థలాలలో పేదలను కలుపుకొని జెండాలు పాతి పేదలకు పంచుతామని వారు హెచ్చరించారు పేదలకు ఒక న్యాయం రాబంధులకు ఒక న్యాయమా అని వారు మునిసిపల్ అధికారులను సూటిగా ప్రశ్నించారు పేదప్రజలకు ఒక న్యాయం భూ ఆక్రమణ దారులకు ఒక న్యాయమా చట్టం న్యాయం అందరికి సమానంగా ఉంటాయని ఇకానైనా మునిసిపల్ అధికారులు కపటనిద్రా మేలుకోకపోతే జరిగే పరిణామలకు అధికారులే బాధ్యత వ్యవహరించాల్సీ వస్తుందని వారు హితువు పలికారు