Breaking News

విద్యార్థుల చేతుల్లోనే ఉజ్వల భవిష్యత్తు సిఐ మహేష్ గౌడ్

(సంగారెడ్డి జిల్లా భారతీయ వెలుగు ప్రతినిధి)

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి

సదాశివపేట అక్టోబర్ 5
ఉజ్వల భవిష్యత్తు విద్యార్థుల  చేతుల్లోనే….
మాదక ద్రవ్వాల పట్ల అప్రమత్తంగా ఉండాలి….
కష్టపడి ఇష్టపడి చదివినప్పుడే ఉన్నత స్థాయికి ఎదుగుతారు….
ఉజ్వల కళాశాల  ఫ్రెషర్స్ పార్టీ లో పట్టణ సీఐ మహేష్ గౌడ్….
సదాశివపేట పట్టణంలోని ఉజ్వల కళాశాలలో ప్రెషర్స్ పార్టీ కార్యక్రమాన్ని విద్యార్థిని విద్యార్థులు జరుపుకున్నారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ సీఐ మహేష్ గౌడ్ గారు పాల్గొనడం జరిగింది, ఆయన మాట్లాడుతూ ఉజ్వల భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోని ఉందని మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండి కష్టపడి ఇష్టపడి చదివినప్పుడే ఉన్నత స్థాయికి ఎదుగుతారని సదాశివపేట పట్టణ సీఐ మహేష్ గౌడ్ అన్నారు. శనివారం నాడు ఉజ్వల కళాశాల ఫ్రెషర్స్ పార్టీ కళాశాల ప్రిన్సిపాల్ కూచి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్ గార్డెన్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో చదువుతోనే సంస్కారం ఏర్పడుతుందని కష్టపడి ఇష్టపడి చదివినప్పుడే ఉన్నత స్థాయికి ఎదుగుతారు అన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలైన మాదకద్రవ్యాలు గంజాయి. సిగరెట్లు. వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అన్నారు. కోసం మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో చదువు నేర్పిస్తున్నారని.  చదువులు నేర్పే గురువుల నుతల్లితండ్రులను గౌరవించి పట్టుదలతో చదివి ఉన్నత స్థాయి మార్కులు  సాధించాలన్నారు. తదుపరి విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు. డీజే డాన్సులు నిర్వహించారుఅనంతరం ప్రతిభావంతులకు గోల్డ్ మెడల్స్. మెడల్స్ తో పాటు మెమొంటోళ్లను సీఐ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ జీనియస్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రణీత రెడ్డి. ముద్ద నాగనాథ్. వాయిస్ ప్రిన్సిపాల్ అమరేందర్ రెడ్డి.విష్ణువర్ధన్ రెడ్డి. కరస్పాండెంట్ పోల వెంకటేశం రెడ్డి డైరెక్టర్ రఘువరన్ రెడ్డి లెక్చరర్లు నర్సింలు. ప్రవీణ్ చంద్రశేఖర్ రంగయ్య సంగమేశ్వర్ రెడ్డి నరేష్ సునీత ప్రియాంక. వరలక్ష్మి . మమతా వైష్ణవి . రాజు. విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
ఫోటో రైట్ అప్. ప్రెషర్ట్స్ పార్టీలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న పట్టణ సిఐ మహేష్ గౌడ్.

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి