Breaking News

అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్టు కాదు డి జే ఎఫ్ జాతీయ అధ్యక్షుడు కృష్ణారెడ్డి

అక్రిడేషన్‌ ఉంటేనే జర్నలిస్టులు కాదు
కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు
సమాచార సేకరలో జర్నలిస్టులపై ఎలాంటి వివక్షత చూపరాదు
వివక్షత చూపే అధికారులకు గుణపాఠం తప్పదు
డీజేఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి

హైదరాబాద్‌: అక్రిడేషన్‌కి జర్నలిజానికి సంబంధం లేదని అక్రిడేషన్‌ ఉంటేనే జర్నలిస్టులని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీజేఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణా రెడ్డి మండిపడ్డారు.కొన్ని ప్రాంతాల్లో కొందరు దళారి జర్నలిస్టులు అక్రిడేషన్‌ ఉన్న జర్నలిస్టులకు మాత్రమే ప్రభుత్వ సమాచారం అందించాలని అధికారులకు,నాయకులకు వినతి పత్రాలు అందిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు.ఈ విషయంపై డీజేఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణా రెడ్డి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.అక్రిడేషన్‌ అనేది ప్రభుత్వం ఇచ్చే రాయితీ కార్డు మాత్రమేనని, జర్నలిస్టులను గుర్తించే పట్టాకానే కాదని గుర్తించుకోవాలన్నారు.అక్రిడేషన్‌ ఉంటేనే జర్నలిస్టు అని ఎవరైనా అంటే అంతకన్నా అవివేకం మరొకటి లేదని,కొందరు చేస్తున్న ప్రచారాన్ని నమ్మి ఎవరైనా అధికారులు పాత్రికేయులకు సమాచారం ఇవ్వడంలో వివక్షత చూపరాదన్నారు.అక్రిడేషన్‌ పేరుతో సమాచారం అందించే విషయంలో జర్నలిస్టులపై వివక్షత చూపించే అధికారులు న్యాయస్థానాల మెట్లు ఎక్కాల్సి ఉంటుందని వివక్షత చూపే అధికారులు,నేతలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజాసమ్యలను వెలుగులోకి తీసుకొచ్చేవారంతా పాత్రికేయులేనన్నారు.జర్నలిస్టులకు గుర్తింపు వారి రాసే వార్తలతోపాటు వారి నిజాయితీ మాత్రమే గుర్తింపని ఈ విషయాన్ని అధికారులు,నేతలు గుర్తించాలన్నారు.అక్రిడేషన్‌ అంగట్లో సరుకులా తయారయిందని అక్రిడేషన్‌ ఉన్నవారంతా జర్నలిస్టులంటే ఒప్పుకోవాల్సిన అవసరం లేదన్నారు.చాలా ప్రాంతాల్లో అక్రిడేషన్‌ నాన్‌ జర్నలిస్టుల చేతిలో ఉన్న విషయాన్ని మరవరాదన్నారు. ఎవరైనా ఎక్కడైనా అక్రిడేషన్‌ పేరుతో సమాచారం అందించే విషయంలో వివక్షత చూపితే తమ దృష్టికి తీసుకరావాలని అలాంటి వారి విషయాన్ని న్యాయస్థానాల్లో తేలుస్తామని ఈ సందర్భంగా డీజేఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి