శంకర్‌పల్లి నూతన సిఐ గా కె శ్రీనివాస్ గౌడ్
భారతీయ వెలుగు శంకర్‌పల్లి అక్టోబర్ 04 : శంకర్‌పల్లి నూతన సిఐగా కె శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం నియమితులయ్యారు. ప్రస్తుతం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ గౌడ్ ను శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణ, మండల ప్రజలు నూతన సీఐ కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.