హత్య కేసును ఛేదించిన మియాపూర్ పోలీసులు
భారతీయ వెలుగు ప్రతినిధి శేరిలింగపల్లి
గత నాలుగు రోజుల క్రితం జరిగిన హత్య కేసును మియాపూర్ పోలీసులు చేదించారు వివరాల్లోకి వెళితే..
మియాపూర్ సిబిఆర్ ఎస్టేట్ లో స్పందన మృతి చెందిన విషయం తెలిసిందే.
హత్యకు గురైన స్పందన ఇంటి పరిసరాలను సీసీటీవి పుటేజ్ సెల్ టవర్ ఆధారంగా మందల మనోజ్ కుమార్ (బాలు) గా గుర్తించిన పోలీసులు. మృతురాలు స్పందన మనోజ్ బాలు ఇద్దరు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. వారు ఇద్దరు చిన్నప్పటి నుండి క్లాస్మేట్లు కావడంతో మనోజ్ స్పందనపై ఇష్టం పెంచుకున్నాడు.
స్పందనకు మరో వ్యక్తితో పెళ్లి జరగడంతో మనోజ్ మనస్థాపానికి గురయ్యాడు. కొన్ని రోజుల తర్వాత స్పందన ఆమె భర్తతో వివాదాలు రావడంతో స్పందన మరో ఇల్లు అద్దెకు తీసుకొని దూరంగా ఉంటున్నారు. ఇదే అదును చూసుకొని స్పందన పై ప్రేమ పెంచుకున్న మనోజ్
తనను ప్రేమించమంటూ పలుమార్లు ఒత్తిడి చేయగా స్పందన తన ప్రేమను తిరస్కరించింది. సాటి ఉద్యోగులు పై స్నేహంగా ఉన్న స్పందనను చూసి తట్టుకోలేక పోయిన మనోజ్ స్పందన పై పగను పెంచుకున్నాడు. మనోజ్ తనకు తెలియకుండానే సిబిఆర్ ఎస్టేట్స్ లో స్పందన ఉన్న అపార్ట్మెంటులోకి చొరబడి స్క్రూ డ్రైవర్, బండరాయితో స్పందన మొహంపై కొట్టగా కొట్టగా ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. యువతి హత్య పై కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు మనోజ్ చంపినట్టుగా నిర్ధారించి అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.