గాయత్రి దేవి గా ఏడుపాయల వన దుర్గమ్మ పాపన్నపేట/మెదక్, అక్టోబర్-04: ( భారతీయ వెలుగుప్రతినిధి), ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలంలో కన్నుల పండుగ కొనసాగుతున్న దుర్గాదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు శ్రీ గాయత్రి దేవి బ్రహ్మచారిని అవతారంలో గులాబీ రంగు వస్త్రాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఆలయ అర్చకులు వేకువ జామునే గోకుల్ షెడ్ లో ప్రతిష్టించి వన దుర్గమ్మను ఉత్సవ విగ్రహానికి అభిషేకం అర్చన నిర్వహించి గులాబీ రంగు చీర వివిధ రకాల పుష్పాలతో అందంగా తీర్చి దిద్దారు. సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదలడంతో అమ్మవారి ఆలయం జలదిద్దాం చిక్కుకుంది ప్రధాన ఆలయంలోకి నవరాత్రులో వనదుర్గ అమ్మవారి ఆలయంల మూసివేయడంతో రాజగోపురం మూలవిరాట్ అమ్మవారు పూజలు అందుకుంటున్న శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు కొనసాగిస్తూ భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. ఆయా కార్యక్రమంలో ఆలయ నిర్వహణ అధికారి చంద్రశేఖర్ సిబ్బంది భక్తులు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.