Breaking News

కొమరం భీమ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే

కొమురంభీమ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి

కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా భారతీయ వెలుగు జిల్లా ప్రతినిధి, అక్టోబర్ : 04

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి

కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జోడెన్ ఘాట్ లో ఈ నెల 17వ తేదీన జరగనున్న కొమురంభీమ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ ఛాంబర్ లో ఆదివాసి, గిరిజన సంఘాల నాయకులతో కలిసి కొమురం భీమ్ వర్ధంతి వేడుకలకు సంబంధించిన గోడ ప్రతులు, కరపత్రాలు, ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసి, గిరిజనుల సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీమ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలిపారు. జల్ జంగల్ జమీన్ నినాదంతో బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన మహావీరుడు కొమురంభీమ్ అని అన్నారు. వర్ధంతి వేడుకల నిర్వహణలో భాగంగా అన్ని శాఖల సమన్వయంతో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, వేడుకలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి, గిరిజన సంఘాల నాయకులు, వర్ధంతి వేడుకల ఉత్సవ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి