Breaking News

శంకర్‌పల్లి లో రామ్ రాజ్ స్టోర్ ప్రారంభం

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి

శంకర్‌పల్లి: అక్టోబర్ 04: భారతీయ వేలుగు: శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి సంగారెడ్డి రోడ్డులో శుక్రవారం 44వ రామ్ రాజ్ స్టోర్ ను సీనియర్ ప్రచారక్ కొరిగింజ రామచంద్రయ్య ప్రారంభించారు. శంకర్‌పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేశారు. బిల్డింగ్ యజమాని దారం లావణ్య రాఘవేందర్ షాపులో మొదటిగా వస్త్రాలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ పెద్ద పెద్ద సంస్థల వారు షాపింగ్ మాల్ లను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని యువత ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎదురు చూడకుండా తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని సూచించారు. షోరూమ్ యజమాని వంశీకృష్ణ గౌడ్, వైష్ణవి లను చైర్ పర్సన్ అభినందించారు. షాపు యజమాని వంశీకృష్ణ గౌడ్ మాట్లాడుతూ రామ్ రాజ్ స్టోర్ వస్త్రాలను ఎల్లప్పుడూ ఆదరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అధునాతన ఫ్యాషన్ డిజైన్లను అందించడానికి ప్రధాన కారణం సొంత మగ్గాలపై తయారు చేయడంతో వినియోగదారులకు తక్కువరేటుకే నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్నామని తెలిపారు. షాపు యజమాని వివిధ పార్టీల నాయకులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి, యూసఫ్ గూడ మాజీ కార్పొరేటర్లు మురళి గౌడ్, సంజయ్ గౌడ్, అజయ్ గౌడ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి