Breaking News

ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియ వేగవంతం చేయండి కలెక్టర్ వెంకటేష్ దో త్రే

ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి

ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలి కలెక్టర్ వెంకటేష్ దోత్రే

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి

కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా భారతీయ తెలుగు జిల్లా ప్రతినిధి, అక్టోబర్ : 04

ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్టు సర్వే ప్రక్రియ వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా లోని ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు, దస్నాపూర్ లో నిర్వహిస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేను ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యుల వివరాలు ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలని, ఇంటి యజమానురాలిగా మహిళ పేరు నమోదు చేసి తర్వాత కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయాలని తెలిపారు. అనంతరం కుటుంబం గ్రూప్ ఫోటోను తీసుకోవాలని, మరణించిన వారు, శాశ్వతంగా వెళ్లిపోయిన వారి పేర్లను తొలగించి, జాబితాలో లేని వారి వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ఉమ్మడి కుటుంబం వివాహం జరిగి వేరువేరుగా నివాసం ఉంటే వారి వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సర్వే నిర్వహించాలని సూచించారు. పైలెట్‌ ప్రాజెక్టు కొరకు జిల్లాలో ఎంపిక చేసిన గ్రామపంచాయతీలు, మున్సిపల్ వార్డులలో సర్వే నిర్వహించి ఈ నెల 9వ తేదీన వివరాలను పరిశీలించి నిర్ణీత ప్రొఫార్మాలో పొందుపరిచి నివేదిక అందించాలని అధికారులు ఆదేశించారు. ఒక కుటుంబానికి ఒక కార్డు ఉంటుందని, కుటుంబంలోని ప్రతి సభ్యుడికి ఒక ప్రత్యేక నంబర్‌ కేటాయించడం జరుగుతుందని, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అన్నింటికీ ఒకే కార్డు అనుసంధానమై ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం అందించనున్న ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు వివిధ సంక్షేమ పథకాలకు

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి