భారతీయ వెలుగు హైదరాబాద్ జనవరి 21
ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనమిక్ ఫోరం శిఖరాగ్ర సదస్సులో భాగంగా దావోస్‌లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం అక్కడ తెలంగాణ పెవిలి యన్‌ను ప్రారంభించింది.
ఈ సందర్భంగా కేంద్రమంత్రులు చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌదరీలతో రేవంత్ రెడ్డి బృందం సమావేశమైంది. తెలంగాణకు సంబంధించిన పలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించింది. మరోవైపు దావోస్‌లో పలు అంతర్జాతీయ సీఈవోలతో రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు భేటీ కానున్నారు..