Breaking News

శేరిలింగంపల్లి సర్కిల్ -20 లో అవుట్ శ్రీనివాస్ దే హవా…

  • ఔట్ సోర్సింగ్ సిబ్బంది
    ఇష్టా రాజ్యం
  • అక్రమ నిర్మాణమా అయితే ఆయన్ను కలవలిసిందే
  • లేదంటే అంతే సంగతి ఏ పని జరగదు
  • టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో అతనిది ప్రత్యేక స్థానం
  • చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు
  • అదేంటో అంతుచిక్కని ‘శ్రీనివాసుని’ మహత్యం

శేరిలింగంపల్లి భారతీయ వెలుగు ప్రతినిధి

శేరిలింగంపల్లి జిహెచ్ఎంసి సర్కిల్ -2o లో ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, అధికారులు అతనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఏళ్ల తరబడి శేరిలింగంపల్లి జిహెచ్ఎంసి సర్కిల్- 20లో ఒకేచోట తిష్ఠ వేసిన ఔట్సోర్సింగ్ సిబ్బంది తను ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. కేవలం సర్కిల్ లోని టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా చేరి నేడు జిహెచ్ఎంసి సర్కిల్ -20 నే శాసిస్తూ తన గుప్పెట్లో పెట్టుకొని పెత్తనం చాలాయిస్తున్నాడని తోటి సిబ్బంది గుసగుసలాడుతున్నారు.

జిహెచ్ఎంసి లోని టౌన్ ప్లానింగ్ శాఖకు తానే అధిపతిగా వ్యవహరిస్తూ..ఇక్కడ ఏ చిన్న పని జరగాలన్న అతని చల్లని చూపు,ఆశీస్సులు అనుమతి తీసుకోవాల్సిందేనని బాధితులు అంటున్నారు. ఎంతలా అంటే కనీసం డీసీ దగ్గరకు వెళ్లే దారులు సైతం ఇతని వైపుకు మళ్లుతాయని అంటున్నారు అతని బాధితులు. సర్కిల్ లో ఇతన్ని కలవాలంటే నమో శ్రీనివాస్ అంటూ కలవాల్సిందే. లేదంటే ఏ పని జరగదు అనేది శేరిలింగంపల్లి సర్కిల్ మొత్తం పుకార్లు షికార్లు కొడుతున్నాయంటే ఇతని హవ ఏ రేంజ్ లో కొనసాగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చని స్థానికలు వాపోతున్నారు.

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి

టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో ఔట్ సోర్సింగ్ పెత్తనం…?

టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో అతని మాటే శాసనం ఎవరికి ఏ పని కావాలన్నా నేను ఉన్న అంటూ మొత్తం అన్ని తనై వ్యవహరిస్తూ..అటు అధికారులకు, జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ సిబ్బందికి కొరకరాని కొయ్యగా తయారైయ్యాడని అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జోనల్ కమిషనర్ ఆదేశాలు బేఖాతరు …

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

తాజాగా శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ జోనల్ కమిషనర్ ఇతని వ్యవహారంపై సీరియస్ అయ్యారని సమాచారం. ఇతని ఆగడాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సదరు సిబ్బందిని విధుల నుంచి తొలగించాలని ఆదేశించినట్లు తెలిసింది. అయినా ఎందుకో మరి కొంతమంది కిందిస్థాయి అధికారులు ఇతన్ని వెనకేసుకొస్తున్నారని విశ్వసనీయ సమాచారం. కమిషనర్ ఆదేశాలను సైతం బే ఖాతరు చేస్తూ ఇతన్ని పెంచి పోషించడంలో ఆంతర్యమేమిటో వారికే తెలియాలని సర్కిల్ ప్రజలు పెదవి నోటిపై వేలేసుకుంటున్నారు.