కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం.. స్పాట్ ఫిక్స్ చేసిన రేవంత్‌రెడ్డి..!!
భారతీయ వెలుగు ప్రతినిధి హైదరాబాద్
తెలంగాణలో ఏడాది కాలంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. ఎవరూ వెనక్కు తగ్గడం లేదు.
ఈ క్రమంలో రెండు మూడుసార్లు మాటలు.. చేతల వరకూ వెళ్లాయి. ఇక పది నెలల క్రితం సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి గత బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన కొన్ని అక్రమాలపై విచారణ కమిషన్ వేశారు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ విచారణ జరుగుతోంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశం సంచలనం రేపింది. ఇంకోవైపు గొర్రెల పంపిణీ కుంభకోణం వెలుగు చూసింది. తర్వాత ఫార్ములా వన్ కోసం అనుమతి లేకుండా రూ.55 కోట్లు కేటాయించిన విషయమై విచారణ జరుగుతోంది. అక్రమాలకు బాధ్యులపై చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల జీయోల్ వెళ్లిన మంత్రివర్గ బృందంలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అక్కడే సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల విషయంలో దీపావళికి ముందే ఒకటి నుంచి తొమ్మిది వరకు అరెస్టులు ఉంటాయని తెలిపారు. రెండు మూడు రోజుల్లోనే జరుగుతాయని ప్రకటించారు. కానీ, దీపావళికి ముందు జన్‌వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్‌పార్టీ అంటూ హడావుడి చేసినా.. ఆ బాంబు పెద్దగా పేలలేదు. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్ అరెస్టు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో 144 సెక్షన్ విధించడం ఇందుకు సంకేతమని ప్రచారం చేస్తున్నారు.
ఒకటి రెండు రోజుల్లో కేటీఆర్ అరెస్ట్?
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే ఒకటి రెండు రోజుల్లో బీఆర్‌ఎస్ కీలక నేత, మాజీ మంత్రి అరెస్ట్ అవుతారని అంచనా వేస్తున్నారు. అయితే అరెస్ట్ అయ్యే నేత ఎవరు అన్నది మాత్రం క్లారిటీ లేదు. చాలా మంది కేటీఆర్ అరెస్ట్ అవుతారని పేర్కొంటున్నారు. ఫార్ములా వన్ కోసం అప్పట్లో కేటీఆర్ ఓ విదేశీ సంస్థకు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా రూ.55 కోట్లు కేటాయించారు. ఈ విషయంలో ఆర్థిక కార్యదర్శిని విచారణ చేసిన ప్రభుత్వం ఇందుకు కేటీఆర్ బాధ్యుడని గుర్తించింది. అక్రమంగా నిధులు కేటాయించినట్లు నిర్ధారణ కావడంతో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
144 సెక్షన్ అందుకేనా?
హైదరాబాద్‌లో ప్రభుత్వం దీపావళి వేళ 144 సెక్షన్ విధించింది. ఈమేరకు సీపీ సీవీ.ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నలుగురుకన్నా ఎక్కువ కలిసి తిరిగినా, గుమికూడినా అరెస్టు చేస్తామని, ధర్నాలు, నిరసనలు, పబ్లిక్ మీటింగ్‌కు అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. ఇందిరా పార్కు వద్ద మాత్రమే ధర్నాకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేత అరెస్ట్ కోసమే ఈ ఆంక్షలన్న ప్రచారం జరుగుతోంది.
ఈడీ విచారణ..
ఇదిలా ఉంటే.. విదేశీ సంస్థకు రూ.55 కోట్లు కేటాయించిన విషయమై ఈడీ విచారణ జరిపింది. ఈడీ ఎదుట హాజరైన మాజీ కార్యదర్శి అరవింద్ కుమార్.. కేటీఆర్ ఆదేశం మేరకే రూ.55 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్‌కు సీఎం రేవంత్‌రెడ్డి స్పాట్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈడీ అరెస్ట్ చేస్తుందా.. రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసిన తర్వాత ఈడీ కస్టడీలోకి తీసుకుంటుందా అన్న చర్చ కూడా జరుగుతోంది.