Breaking News

డెడికేషన్ కమిటీ .రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం, బీసీ రిజర్వేషన్ ప్రక్రియ

ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం.. నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశం

భారతీయ వెలుగు ప్రతినిధి హైదరాబాద్

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. డెడికేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు

తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల విషయంలో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం డెడికేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బీసీ రిజర్వేషన్‌లకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఎప్పటికప్పుడు తొలగించేందుకు ఈ కమిటీ అవసరమైన సూచనలు, సిఫార్సులను చేయాల్సి ఉంది. ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా సర్వే ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

బీసీ రిజర్వేషన్ల ప్రక్రియలో…
ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణలో సామాజిక ఆర్థిక, విద్య, ఉపాధితో పాటు కుల సర్వేను ప్రారంభించనున్న నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా డెడికేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. కోర్టు తీర్పుల ప్రకారం అనుసరించి, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చూసే బాధ్యత ఈ డెడికేషన్ కమిటీదిగా నిర్ణయించారు. ఈరోజు ఉత్తర్వులు ఈ డెడికేషన్ కమిటీకి సంబంధించిన ఉత్తర్వలు విడుదలయ్యే అవకాశముంది. ఈ మేరకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.