Breaking News

రాహుల్ నిజంగానే రేవంత్ రెడ్డిని సైడ్ చేశారా…?

భారతీయ వెలుగు ప్రతినిధి హైదరాబాద్

రాహుల్ నిజంగానే రేవంత్ ను సైడ్ చేసేశారా?

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి

తెలంగాణ రాజ‌కీయాల్లో అతి త‌క్కువ స‌మ‌యంలో ఊహించ‌ని గుర్తింపు, అవ‌కాశాలు సృష్టించుకున్న‌ది మ‌రియు సాధించుకున్న‌ది ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అని చెప్ప‌డంలో ఎంత మాత్రం అతిశ‌యోక్తి లేదు. దీనికంత‌టికీ రేవంత్ ప్లానింగ్‌, క‌లిసి వ‌చ్చిన స‌మ‌యం, అధిష్టానం పెద్ద‌లు క‌ల్పించిన అవ‌కాశాలు అనేది నిజం. ముఖ్యంగా పార్టీ యువ‌నేత రాహుల్ గాంధీ క‌ల్పించిన ప్రోత్సాహం దీనికి కార‌ణం అని అనుకోవ‌చ్చు. అయితే, రాహుల్‌ గాంధీతో రేవంత్ రెడ్డి కి గ్యాప్ వ‌చ్చింద‌ని అంత‌ర్గ‌త గుస‌గుస‌లు మొద‌లై రాజ‌కీయ పార్టీలు బ‌హిరంగంగా ప్ర‌క‌టించేవ‌ర‌కూ చేరిపోయింది. తాజాగా దీనికి సంబంధించి ఓ కీల‌క అప్డేట్ వెలుగులోకి వ‌చ్చింది.

తెలంగాణ రాష్ట్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయం లెక్క తేల్చేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం నవంబర్ 6 నుంచి 20 రోజులపాటు మొత్తం 75 ప్రశ్నలతో రూపొందించిన ఫార్మాట్ లో సమగ్ర సమాచారాన్ని నమోదు చేయనున్న సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు పూర్త‌యింది. అయితే, ఈ విష‌యంలో పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేష్ కుమార్ గౌడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అక్టోబర్ ఆరు లేదా ఏడో తేదిన కులగణనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామ‌ని వెల్ల‌డించారు. ఈ నెల 5వ తేదీన సాయంత్రం 4 గంటలకు బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో కులగణనపై మీటింగ్ నిర్వహిస్తామ‌ని, ఈ సమావేశానికి త‌మ పార్టీ ముఖ్య‌ నేత రాహుల్ గాంధీ కూడా హాజరవుతార‌ని గౌడ్‌ వెల్ల‌డించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఈ కులగణన ప్రక్రియపై రాహుల్ వివరాలు అడిగి తెలుసుకుంటార‌ని పీసీసీ అధ్య‌క్షుడు వివ‌రించారు.

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి