శంకర్పల్లి: నవంబర్ 02: ( భారతీయ వెలుగు): శంకర్పల్లి మండల పరిధిలోని దుంతాన్ పల్లి గ్రామ శివారులో గల ఐబీఎస్ కాలేజీ ఎదురుగా నూతనంగా ఏర్పాటుచేసిన ఐడియల్ కిచెన్ ను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సీతక్క శనివారం రిబ్బన్ కట్ చేసి, లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత స్వయం ఉపాధిలో రాణించాలని సూచించారు. ఐడియల్ కిచెన్ ను ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని మంత్రి అభినందించారు. ఐడియల్ కిచెన్ యాజమాన్యం మంత్రిని శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు సభ్యులు సత్యనారాయణ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మహిళ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు జ్యోతి, మండల, మున్సిపల్ వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.