భారతీయ వెలుగు ప్రతినిధి హైదరాబాద్
దీనిపై అన్ని రాజకీయ పార్టీలు కూడా మండి పడుతున్నాయి.
ఈ క్రమంలో శనివారం రాత్రిపూట రాజేంద్ర నగర్ లోని జన్వాడలో డీజే సౌండ్ లు వస్తున్నాయని స్థానికులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తొంది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్కడ విదేశీ లిక్కర్ బాటిళ్లు ఉండటంను గుర్తించారు.
రాజ్ పాకాల అనే వ్యక్తి తాను.. కేటీఆర్ బావమరిదినని కూడా పోలీసులతో వాగ్వాదంకు దిగినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ ఎవరైన డ్రగ్స్ తీసుకున్నారా.. అన్న కోణంతో విచారణ చేపట్టారు. అంతే కాకుండా.. ఇది తమ ఫ్యామీలీ పార్టీ ఇక్కడ డ్రగ్స్ ఎవరు తీసుకొలేదని కూడా అక్కడి వాళ్లు పోలీసులతో వాగ్వాదంకు దిగినట్లు తెలుస్తొంది. అయితే.. పోలీసులు రాజ్ పాకాల, విజయ్ మజ్దూరీలను మాత్రం దీనిలో కేసులను నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు జన్వాడ ఘటనలనో మాజీ మంత్రి కేటీఆర్ సతీమణి శైలీమను విచారించినట్లు తెలుస్తొంది. అందరితో పాటు శైలీమను కూడా విచారించినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు పోలీసుల విచారణకు విజయ్ మద్దూరి సహకరించడం లేదని సమాచారం. పోలీసు స్టేషన్‌లో విచారణకు విజయ్ మద్దూరి హాజరుకాలేదు. రైడ్ సమయంలో తన మొబైల్ దాచిపెట్టి మరో మహిళ మొబైల్ ను పోలీసులకు విజయ్ మద్దూరి అందించినట్లు సమాచారం. తన మొబైల్ దొరికితే డ్రగ్స్ లింక్స్ బయటపడతాయన్న భయంతో వేరే మహిళ ఫోన్ పోలీసులకు అందించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
దాడుల సమయంలో విజయ్ మద్దూరి పక్కనే అతడి సతీమణి ఉంది. అయినా ఆమె నెంబర్ పోలీసులకు ఇవ్వకుండా మూడో వ్యక్తి నంబర్‌ను ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తుంది. దాడుల సమయంలో పోలీసుల నుంచి తప్పించుకుని రాజ్‌పాకాలా పరార్ అయ్యాడు. దాంతో ఈ కేసులో రాజ్ పాకాల, విజయ మద్దూరి పోలీస్ విచారణలో నోరు మెదిపితే సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని సమాచారం. మరోవైపు ఈపార్టీలో డబ్బులు రూపంలో కాకుండా కాయిన్స్ రూపంలో పేకాట ఆడినట్లు తెలుస్తోంది. రాజ్ పాకాలా హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తొంది.