Breaking News

మెట్రో ను విస్తరించక పోతే ఉద్యమమే ఎమ్మెల్యే వివేకానంద గౌడ్

మేడ్చల్ కు మెట్రోను విస్తరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం: ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

భారతీయ వెలుగు ప్రతినిధి

ఈరోజు మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో జీడిమెట్ల గ్రామంలోని గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గార ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారుమాట్లాడుతూ…

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బృహత్ ప్రణాళికతో మహానగరాభివృద్ధి….
గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నగరానికి నలువైపులా
మెట్రో విస్తరణ, ఫ్లైఓవర్లు, అండర్ పాసుల నిర్మాణం వంటి అభివృద్ధి పనులతో పెద్దలు కేసీఆర్ గారు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసి నగరానికి ఉత్తరం వైపున కొంపల్లి, మేడ్చల్ ప్రాంతాలతో పాటు తూముకుంట, శామీర్పేట్ ప్రాంతాలకు మెట్రో విస్తరణ పై సర్వే సంస్థలను ఎంపిక చేసి పనులను అప్పగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే పక్కన పెట్టి ఫోర్త్ సిటీ పేరుతో ఊహల నగరానికి మెట్రో విస్తరణ ను చేపట్టాలని అనుకోవడం కుత్బుల్లాపూర్ ప్రజలను అవమానించడమే.

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి

ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపి ముఖ్యమంత్రి ఇన్ సైడ్ ట్రేడింగ్ కు పాల్పడుతున్నారు….
ఫోర్త్ సిటీ పేరుతో తన ఊహల నగరంగా సృష్టించి లేని నగరానికి మెట్రో విస్తరణ పేరుతో 8 వేల కోట్ల రూపాయలు ప్రతిపాదించడం వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపార ఆలోచన తప్పా ప్రజలకు ఎటువంటి మేలు జరగదు. ఫోర్త్ సిటీ పేరుతో ముఖ్యమంత్రి ఇన్ సైడ్ ట్రేడింగ్ కు పాల్పడుతున్నారు.

ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా సంక్షేమం కోసం ఉండాలే తప్పా స్వార్థ రాజకీయాల కోసం కాదు…
ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా సంక్షేమం కోసం ఉండాలే తప్పా స్వార్థ రాజకీయాల కోసం కాదు. ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ భూములను పోగుచేసి వ్యాపారం చేస్తూ తమ స్వార్ధ రాజకీయాల కోసం కుత్బుల్లాపూర్, మేడ్చల్ ప్రజలను విస్మరిస్తున్నారు.

ముఖ్యమంత్రి తన అనుభవరాహిత్యం, అసంబద్ధ నిర్ణయాలతో కోర్టులతో నిత్యం మొట్టి కాయలే…
చెరువుల పరిరక్షణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటుచేసిన హైడ్రా, మూసి సుందరీకరణ పేరుతో పేదల ఇల్లా కూల్చివేత, ఫోర్త్ సిటీ పేరుతో ఊహల నగరానికి నిధుల కేటాయింపు వంటి నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నిర్ణయాల వెనుక ముఖ్యమంత్రి అనుభవ రాహిత్యం, అవగాహన లేమి స్పష్టంగా కనపడుతుంది. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతినిత్యం కోర్టులు మొట్టికాయలు వేస్తూనే ఉన్నాయి. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేడ్చల్ కు మెట్రోను ప్రతిపాదిస్తూ బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ గార సర్వే సంస్థలకు పనులు అప్ప చెప్పడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో మేడ్చల్ మెట్రో పనులను విస్మరించడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మాకు న్యాయబద్ధంగా రావాల్సిన మేడ్చల్ మెట్రో ను సాధించి తీరుతాం.

మేడ్చల్ కు మెట్రోను విస్తరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం..
ఉత్తర తెలంగాణకు నగరానికి కనెక్టివిటీగా ఉన్న జాతీయ రహదారి 44 లో మేడ్చల్ ప్రాంతం గుండా నిత్యం నిజామాబాద్, కరీంనగర్, ప్రాంతాలకు మంత్రులు ప్రయాణిస్తూ ఉంటారు. మేడ్చల్ కు మెట్రో ను విస్తరించకుంటే ఈ మార్గంలో ఏ ఒక్క మంత్రిని కూడా తిరగనివ్వం. అడ్డుకొని తీరుతాం.

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మెట్రో సాధన సమితి కార్యవర్గ సభ్యులు, కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.