పల్లెల నుండి ప్రపంచ స్థాయికి క్రీడాకారులు ఎదగాలని అదనపు కలెక్టర్
సీఎం కప్పు పైన అవగాహన కల్పించడానికి టార్చి ర్యాలీ నిర్వహణ
మంబోజిపల్లి బ్రిడ్జి నుండి మెదక్ అవుట్ డోర్ స్టేడియం, వరకు టార్చ్ ర్యాలీ
మెదక్, అక్టోబర్-04( భారతీయ వెలుగు ప్రతినిధి),
పల్లెల నుండి ప్రపంచ స్థాయికి అత్యుత్తమ ప్రతిభ కనపరిచే క్రీడాకారులుగా ఎదగాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
శుక్రవారం మెదక్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర క్రీడ సాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడాకారణ ప్రోత్సహించాలని
సీఎం కప్పు పైన అవగాహన కల్పించడానికి టార్చి ర్యాలీ అనే కార్యక్రమం మెదక్ బోర్డ్ నుండి అవుట్డోర్ స్టేడియం వరకు టార్చ్ ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ ర్యాలీలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశం తో సీఎం కప్ పేరుతో గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లాస్థాయి మరియు రాష్ట్రస్థాయి లలో క్రీడలను నిర్వహించడం జరుగుతుంది. టార్చ్ ర్యాలీ నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పల్లెల నుండి ప్రపంచ స్థాయికి క్రీడాకారులు ఎదగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల నిర్వహణ అధికారి దామోదర్ రెడ్డి ,డివైస్ ఓ వెంకటేశ్వర్లు,స్పోర్ట్స్ ఫౌండేషన్ సభ్యులు క్రీడాకారులు, ఇంచార్జ్ రంగారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు యువకులు పాల్గొన్నారు.