భారతీయ వెలుగు సంగారెడ్డి
- ▪️ కుటుంబాల సమగ్ర సమాచారం తో సర్వే చేయనున్నట్లు వెల్లడి…. మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మెదక్,అక్టోబర్-04:(తెలుగు వెలుగు ప్రతినిధి), ఒక కుటుంబం ఒక కార్డు లక్ష్యం గా డిజిటల్ కార్డులను అందజేయనున్నట్లు
అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు శుక్రవారం మెదక్ మున్సిపాలిటీ పరిధిలో పత్తే నగర్ 20వ వార్డు నందు రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన. డిజిటల్ ఫ్యామిలీ కార్డు సర్వే ను అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్వయంగా
కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వే పగడ్బందీగా నిర్వహణకు అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. దారిద్య్ర రేఖ కు దిగువ (బిపిఎల్) దారిద్య్ర రేఖ కు ఎగువ (ఏపిఎల్) తో సంబంధం లేకుండా ఒక కుటుంబానికి ఒక గుర్తింపు కార్డు అందజేయడానికి సంబంధిత కుటుంబం యొక్క డేటా అంత ఆ కార్డులో నిక్షిప్తమై ఉండేలా, దేశస్థాయిలో ఆధార్ కార్డు కు ఎంతటి ప్రాముఖ్యం ఉందో అదే స్థాయిలో ఫ్యామిలీ కార్డు పనిచేసేలా ఎక్కడి నుండైనా ఈ కార్డు పనిచేసేలా రూపొందించడం జరుగుతుందని అన్నారు.
మున్సిపాలిటీ పరిధిలో 289 కుటుంబాలు లక్ష్యంగా నాలుగు బృందాలుగా విడిపోయి
సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు
ప్రతి కుటుంబం యొక్క సమగ్ర వివరాలకు సంబంధించిన షీట్ ప్రత్యేకంగా ఉండాలని ఆయన సూచించారు.
ప్రతి ఒక్కరూ అధికారులకు అవసరమైన సమాచారం ఇచ్చి సహకరించాలని సూచించారు
సర్వేలో ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
మరణించిన వారి పేర్లను తొలగించడం, కొత్తగా కుటుంబంలో చేరిన వారి పేర్లను నమోదు చేయడం, ఉమ్మడి కుటుంబంలో వివాహాలు జరిగిన వారికి కుటుంబాల వారిగా కార్డులను అందజేయడం జరుగుతుందని, ప్రస్తుతం అందజేసే డిజిటల్ కార్డులో మహిళలను కుటుంబ యజమానిగా పేర్కోనడం జరుగుతుందని,
చెప్పారు. నిష్పక్షపాతంగా పారదర్శకం గా సర్వే లక్ష్యంగా ముందుకు పోతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ లక్ష్మణ్ బాబు రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.