Breaking News

“దేవుడిని రాజకీయాల్లోకి లాగకండి”ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో సంచలనాలు

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటోలున్న ఒక పోస్టును ఎక్స్​ (మాజీగా ట్విట్టర్) వేదికగా షేర్ చేశారు. ఆ పోస్టు కింద, “దేవుడిని రాజకీయాల్లోకి లాగకండి” అంటూ ప్రకాశ్ రాజ్ విజ్ఞప్తి చేశారు.

ప్రకాశ్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం లడ్డూ వివాదంపై ఆయన చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నాయకులు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు వంటి ప్రముఖుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి

తాజాగా మరోసారి ప్రకాశ్ రాజ్ ఈ వివాదంపై స్పందిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు చేయడం చర్చనీయాంశమైంది. తన పోస్టులో “#JustAsking #JustPleading” హ్యాష్‌ట్యాగ్‌లతో దేవుని పేరును రాజకీయ లబ్ధికోసం ఉపయోగించొద్దని ఆకాంక్షించారు.

ఈ వ్యాఖ్యలు పలు వర్గాల మధ్య చర్చనీయాంశంగా మారడంతో, లడ్డూ వివాదం ఇంకా ముదురుతున్నట్లు తెలుస్తోంది.

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి