Breaking News

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుంజుకోవడం కష్ట సాధ్యమే

గున్నాల అనిల్ రెడ్డి

తెలంగాణలో టీడీపీకి నో స్పేస్ !

భారతీయ వెలుగు హైదరాబాద్

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి

తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేరుతానని ప్రకటించగానే మళ్లీ తెలంగాణలో టీడీపీ భవిష్యత్ అంటూ చర్చ ప్రారంభమయింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో పొలిటికల్ వాక్యూమ్ లేదు. మరో పార్టీకి చోటు లేదు. ఆ చోటు దక్కించుకోవాలంటే మరో పార్టీని బలహీనం చేయాలి. అదంత తేలికైన విషయం కాదు. కనీసం అలాంటి ప్రయత్నం చేయాలన్నా ఓ బలమైన నాయకుడు అవసరం. అలాంటి నాయకుడు టీడీపీకి దొరికే అవకాశం కనిపించడం లేదు. తీగల కృష్ణారెడ్డి, మల్లారెడ్డి లాంటి వాళ్ల వల్ల అయ్యేది..పొయ్యేది ఏదీ ఉండదు.

బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ ప్రత్యేకం. అతి తెలంగాణ సెంటిమెంట్ లో ఉంటుంది. ఆ ట్రాప్ నుంచి బయటపడిన వారు బీజేపీ, కాంగ్రెస్ వైపు వెళ్లిపోతున్నారు . బీఆర్ఎస్ ఎంత బలహీనపడినా ఆ పార్టీలో ఉన్న లీడర్ , క్యాడర్ మాజీ టీడీపీ అయినా సరే.. టీడీపీలో మనస్ఫూర్తిగా ఉండలేరు. రాలేరు కూడా. ఎందుకంటే… టీడీపీని తెలంగాణ సమాజంలో ఆంధ్రాపార్టీగా కేసిన వేసిన ముద్ర ఇప్పటికీ చెరిగిపోలేదు. చెరిగిపోవడం ఇప్పుడల్లా సాధ్యం కాదు. పోనీ హైదరాబాద్ లో అయినా ప్రభావం చూపుతారా అంటే… టీడీపీ అంటే అభిమానం చూపేవారు ఉన్నా.. టీడీపీకి ఓటు వేస్తే ఏంటి ప్రయోజనం అని ఆలోచించే ఓటర్లే వారంతా . చదువుకున్నవారే. అందుకే ఓటింగ్ సమయంలో ఓటు వృధా చేసుకోవడం ఎందుకని ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.

ఇక టీడీపీతో పొత్తులు పెట్టుకుని పోటీ చేసేందుకు కూడా పెద్దగా పార్టీలు ఆసక్తి చూపే అవకాశం లేదు. ఏపీలో పొత్తులో ఉన్నందున తెలంగాణలో టీడీపీ, జనసేనతో పొత్తుల గురించి చర్చ జరుగుతుంది. కానీ బీజేపీ ఇక పొత్తుల గురించి ఆలోచించడం కన్నా… సొంత పోటీ గురించి ఎంత ఎక్కువగా ఫోకస్ చేస్తే అంత మంచిదని ఆ పార్టీ నేతలు గట్టిగానే చెబుతున్నారు. అంటే పొత్తులకూ అవకాశం లేదని అనుకోవచ్చు.

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

చంద్రబాబు కూడా టీడీపీ భవిష్యత్ తెలంగాణలో ఉంటుందా ఉండదా అన్నదానిపై పెద్దగా దృష్టి పెట్డడం లేదు. కాసాని రాజీనామా తర్వాత ఇప్పటి వరకూ తెలంగాణ టీడీపీ అధ్యక్షుడ్ని నియమించకపోవడమే దీనికి సంకేతం. పార్టీలో చేరుతానన్న తీగల కృష్ణారెడ్డి కామెంట్స్ కు .. చంద్రబాబు తరవతా మాట్లాడదామని రిప్లయ్ ఇచ్చారంటే… పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.