Breaking News

సర్వే అక్టోబర్ 10 లోపు పూర్తి చేయాలి కలెక్టర్ శ్రీ హర్ష

గ్రామ పాలనలో నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి… జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులు, స్కిల్ డెవలప్మెంట్ సర్వే అక్టోబర్ 10 లోపు పూర్తి చేయాలి

మేజర్ గ్రామ పంచాయతీలో నిధుల సర్దుబాటు ప్రకారం పనుల ప్రతిపాదనలు సమర్పించాలి

ప్రతి గ్రామంలోని సెగ్రిగేషన్ షెడ్ నెలాఖరు వరకు పూర్తి స్థాయిలో పని చేయాలి

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి

మేజర్ గ్రామ పంచాయతీల పని తీరు పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

భారతీయ వెలుగు పెద్దపల్లి// గ్రామ పాలనలో నిర్దేశిత లక్ష్యాల సాధనకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి గ్రామ పంచాయతీల పని తీరు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష*మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో ఉన్న ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను పరిశీలించి అక్టోబర్ 10 లోపు పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు. చెరువుల ఎఫ్.టి.ఎల్, బఫర్ జోన్ పరిధిలోకి లే ఔట్లు వస్తున్నాయో లేదో నీటిపారుదల శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

ఎల్.ఆర్.ఎస్ సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లను పలు మార్లు దరఖాస్తుదారులకు ఫోన్ చేసినప్పటికీ సమర్పించని దరఖాస్తులను షార్ట్ ఫాల్ పెట్టి రివర్ట్ చేయాలని అన్నారు. గ్రామ పంచాయతీలలో పన్ను వసూలు చాలా తక్కువగా ఉందని, అక్టోబర్ నెలాఖరు వరకు నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు పన్ను వసూలు చేయాలని కలెక్టర్ పంచాయతి కార్యదర్శులకు సూచించారు.

గ్రామ పంచాయతీలలో అందుబాటులో ఉన్న నిధుల ప్రకారం చేపట్టాల్సిన ప్రాధాన్యత పనుల ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. గ్రామాలలో పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యత కల్పించాలని, ప్రతిరోజు చెత్త సేకరణ జరగాలని, అక్టోబర్ నెలాఖరు వరకు సేగ్రిగేషన్ షెడ్ల పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావాలని కలెక్టర్ ఆదేశించారు.

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

గ్రామ పంచాయతీలోని మల్టీ పర్పస్ వర్కర్ల జీతాలు ప్రతి నెలా అందేలా చూడాలని అన్నారు. పంచాయతీలలో వ్యాపారం నిర్వహించే వారు ట్రేడ్ లైసెన్సులు పొందేలా చూడాలని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, ఎంపీడీవో లు, ఎంపీఓ లు, పంచాయతీ సెక్రటరీ లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.